బంజారహిల్స్‌లో భారీ దొంగతనం.. వజ్రాలు, బంగారం మాయం | Women Arrested In Robbery Case In Hyderabad Banjara Hills, See Details - Sakshi
Sakshi News home page

బంజారహిల్స్‌లో భారీ దొంగతనం.. వజ్రాలు, బంగారం మాయం

Dec 30 2023 9:46 AM | Updated on Dec 30 2023 5:33 PM

 Women Arrest in Robbery Case Hyderabad - Sakshi

హైదరాబాద్: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ కోసం బంజారాహిల్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలివీ... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 8లోని వైట్‌హౌస్‌ సెలెస్టియా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కొడాలి ధనలక్ష్మి అక్టోబర్‌ 16వ తేదీన మంగోలియా దేశం విజిట్‌చేసేందుకు బ్యాగులో మూడు వజ్రాలు పొదిగిన గాజులు, ఒక బంగారు గాజు, మరో వాచీని సర్దుకుంది. 

ఆ బ్యాగు తీసుకొని మంగోలియా యాత్రకు వెళ్లిది. అక్కడికి చేరిన తర్వాత బ్యాగు తెరిచి చూడగా అందులో ఉండాల్సిన రూ. 10 లక్షల వజ్రాభరణాలు, వాచ్‌ కనిపించలేదు. ఈ నెల 24వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో చూడగా ఎక్కడా కనిపించలేదు.

బ్యాంకు లాకర్లో కూడా దొరకలేదు. అయితే ఇంట్లో పని చేసే శ్రీలత అనే పనిమనిషి తాను మంగోలియా వెళ్లే సమయంలో బ్యాగును సర్దిందని ఆ సమయంలో వాటిని తస్కరించి ఉంటుందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement