
మద్యంపై ప్రశ్నించిన మహిళలు అరెస్ట్
కదిరి : పట్టణంలోని కందికుంట నారాయణమ్మ కాలనీలో గుడి పక్కన, మసీదుకు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం ఎత్తి వేయాలని శనివారం ఆ దుకాణం ముందు నిరసన తెలిపిన ఐద్వా మహిళలను కదిరి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకు మునుపు వారు చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో ఐద్వా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరలక్ష్మి, పద్మావతమ్మ, కుషీదా, పార్వతమ్మ, ఎల్లమ్మ, కళావతమ్మ, లక్ష్మిదేవి, భవాణి ఉన్నారు.