స్నేహితురాలితో రహస్యంగా మూడో పెళ్లి..? | roomers over Imran Khan's third marriage with friend | Sakshi
Sakshi News home page

స్నేహితురాలితో రహస్యంగా మూడో పెళ్లి..?

Published Sat, Jan 6 2018 2:28 PM | Last Updated on Sat, Jan 6 2018 2:42 PM

roomers over Imran Khan's third marriage with friend - Sakshi

మొదటి, రెండో భార్యలతో ఇమ్రాన్‌ (ఫైల్‌ ఫొటోలు)

లాహోర్‌ : మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌(65) రహస్యంగా మూడోపెళ్లి చేసుకున్నారన్న వార్త పొరుగుదేశంలో చర్చనీయాంశమైంది. ఖాన్‌కు ఆథ్యాత్మిక సలహాదారుగానేకాక, స్నేహితురాలిగానూ కొనసాగుతోన్న మహిళను జనవరి 1న పెళ్లాడినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఖాన్‌ ఆంతరంగికులు కొందరు మాత్రమే వివాహతంతులో పాల్గొన్నట్లు తెలిపాయి.

1992లో పాక్‌ జట్టుకు క్రికెట్‌ ప్రపంచ కప్‌ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్‌.. తొలుత బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్‌.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. కొంతకాలంగా ఆయన ఒంటరిగా ఉంటున్నారు.

అవన్నీ అవాస్తవాలు : కాగా, ఇమ్రాన్‌ మూడోపెళ్లి విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని పీటీఐ ప్రతినిధులు అన్నారు. ‘‘కొందరు పనిగట్టుకొని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. ప్రస్తుతం ఆయన(ఇమ్రాన్‌) దృష్టంతా 2018 ఎన్నికలపైనే ఉంది. ఒకవేళ మూడో పెళ్లంటూ చేసుకుంటే ఎన్నికల తర్వాతే చేసుకుంటారు’’ అని ఖాన్‌ సన్నిహితులు స్పష్టతనిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement