ఇమ్రాన్‌ ఖాన్‌... మూడో పెళ్లి | Imran Khan gets married a third time | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ ఖాన్‌... మూడో పెళ్లి

Published Tue, Feb 20 2018 1:09 AM | Last Updated on Tue, Feb 20 2018 1:09 AM

 Imran Khan gets married a third time - Sakshi

ఇమ్రాన్‌ఖాన్‌

లాహోర్‌: పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం, తెహ్రీక్‌–ఎ–ఇన్సాఫ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ఖాన్‌ (65) మూడో వివాహం చేసుకున్నాడు. తన ఆధ్యాత్మిక సలహాదారుగా వ్యవహరిస్తున్న బుష్రా మనేకాను ఇమ్రాన్‌ పెళ్లాడాడని పార్టీ అధికారి ప్రతినిధి ఫవాద్‌ చౌదరి ఆదివారం వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పార్టీ ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పాక్‌కు 1992 ప్రపంచకప్‌ అందించిన ఇమ్రాన్‌... క్రికెట్‌ నుంచి వైదొలగిన అనంతరం 1995లో బ్రిటన్‌ బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహమాడాడు.

వీరికి ఇద్దరు అబ్బాయిలు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయాడు. 2015లో బీబీసీ జర్నలిస్ట్‌ రేహమ్‌ ఖాన్‌ను మనువాడినా 9 నెలలకే ఆ బంధం తెగిపోయింది. బుష్రాను ఇమ్రాన్‌ పెళ్లి చేసుకున్నట్లుగా ఇటీవల వదంతులు వస్తున్నాయి. వీటిని అతడు ఖండించాడు. కానీ ఈ ప్రభావం పార్టీపై పడుతుండటంతో స్పష్టత ఇవ్వాలని నాయకుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో విషయాన్ని మాజీ క్రికెటర్‌ అధికారికంగా వెల్లడించాడు. బుష్రాకు ఇది వరకే వివాహమైంది. ఆమెకు ఐదుగురు పిల్లలున్నారు. కస్టమ్స్‌ అధికారి అయిన తన భర్త ఫరీద్‌ మనేకా నుంచి ఆమె విడాకులు తీసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement