ముచ్చటపడి చేసుకున్న మూడో పెళ్లి కూడా పెటాకులు కావడంతో ఇమ్రాన్ ఖాన్ కష్టాలు ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు, పిల్లల వ్యవహారాల్లో దంపతుల మధ్య విబేధాలు తలెత్తాయని, గొడవపడిన తర్వాత మూడో భార్య బుష్రా తన పుట్టింటికి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.