పీలే మూడో వివాహం | Football great Pele to marry for 3rd time at 75 | Sakshi
Sakshi News home page

పీలే మూడో వివాహం

Jul 11 2016 1:23 AM | Updated on Oct 2 2018 8:39 PM

పీలే మూడో వివాహం - Sakshi

పీలే మూడో వివాహం

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 75 ఏళ్ల వయస్సులో మూడోసారి పెళ్లికొడుకయ్యారు. జపాన్‌కు చెందిన తన చిరకాల ప్రియురాలు...

సావోపాలో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 75 ఏళ్ల వయస్సులో మూడోసారి పెళ్లికొడుకయ్యారు. జపాన్‌కు చెందిన తన చిరకాల ప్రియురాలు... 50 ఏళ్ల మార్సియా సిబెల్ వోకిని శనివారం ఆయన వివాహం చేసుకున్నారు. 1980ల్లో తొలిసారిగా వీరిద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. అయితే 2010 నుంచి మాత్రం సన్నిహితులయ్యారు. వ్యాపార వేత్త అయిన వోకి ఇటీవలి కాలంలో పీలే పలుమార్లు అనారోగ్యానికి గురైనప్పుడు దగ్గరుండి సపర్యలు చేశారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నా పీలే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వాయిదా పడింది.

పీలే అన్ని స్థాయిల్లో కలిపి తన కెరీర్‌లో 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్ చేశారు. 1957 నుంచి 1971 మధ్య బ్రెజిల్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడారు. పీలే సభ్యుడుగా ఉన్న బ్రెజిల్ జట్టు 1958, 1962, 1970లలో ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement