Marcia Cibele Aoki
-
పీలే మూడో వివాహం
సావోపాలో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే 75 ఏళ్ల వయస్సులో మూడోసారి పెళ్లికొడుకయ్యారు. జపాన్‌కు చెందిన తన చిరకాల ప్రియురాలు... 50 ఏళ్ల మార్సియా సిబెల్ వోకిని శనివారం ఆయన వివాహం చేసుకున్నారు. 1980ల్లో తొలిసారిగా వీరిద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. అయితే 2010 నుంచి మాత్రం సన్నిహితులయ్యారు. వ్యాపార వేత్త అయిన వోకి ఇటీవలి కాలంలో పీలే పలుమార్లు అనారోగ్యానికి గురైనప్పుడు దగ్గరుండి సపర్యలు చేశారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే వీరిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నా పీలే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వాయిదా పడింది. పీలే అన్ని స్థాయిల్లో కలిపి తన కెరీర్లో 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్ చేశారు. 1957 నుంచి 1971 మధ్య బ్రెజిల్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడారు. పీలే సభ్యుడుగా ఉన్న బ్రెజిల్ జట్టు 1958, 1962, 1970లలో ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది. -
దిగ్గజ ఆటగాడికి మూడో పెళ్లి
రియోడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాట్ మాజీ దిగ్గజం పీలే త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇదివరకే ఇద్దర్ని వివాహామాడిన పీలే వారికి విడాకులిచ్చిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల ఈ ఫుట్‌బాల్ లెజెండ్, 42 ఏళ్ల మార్సియా సిబెలే వివాహం మంగళవారం జరగనుంది. వీరిద్దరూ 2010 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు కొన్ని నెలల నుంచి వార్తలు ప్రచారం అవుతున్నాయి. తన పెళ్లి వార్తను పీలే స్వయంగా మీడియాకు తెలిపారు. 1958, 1962, 1970లలో ఫుట్ బాల్ ప్రపంచకప్ సొంతం చేసుకున్న బ్రెజిల్ జట్టులో కీలక ఆటగాడు పీలే. 1363 మ్యాచ్ లాడిన పీలే 1281 గోల్స్ చేశాడు. వ్యక్తిగత జీవితానికొస్తే.. పీలే మొదట రోస్ మేరి ఛోల్బీని పెళ్లి చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం కలిగారు. ఆ తర్వాత అస్సీరియా నాస్కిమెంటోతో జీవితాన్ని పంచుకున్నాడు. ఆమెతో జోషువా, సెలెస్ట్ అనే ఇద్దరు కవలలకు పీలే తండ్రయ్యారు. ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్న బ్రెజిల్ మాజీ ఆటగాడు తన గర్ల్ ఫ్రెండ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు.