
మూడో పెళ్లి చేసుకున్న సంగీత దర్శకుడు
రామనాథపురం: ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా చిన్న కుమారుడు యువన్ శంకర్ రాజా మూడో వివాహం చేసుకున్నారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని కిజాకరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిమ్ యువతి జఫరున్నీసాను గురువారం ఆయన పెళ్లి చేసుకున్నారు.
కిజాకరాయ్ సమీపంలోని శంకళ్నీరొదైలో ఓ గార్డెన్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీరి వివాహం జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పెళ్లి కూతురు బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టు తెలిపాయి. 35 ఏళ్ల యువన్ గతంలో సుజయ చంద్రన్, శిల్పా మోహన్ లను పెళ్లాడారు. తర్వాత వారికి విడాకులిచ్చారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో వంద చిత్రాలకు యువన్ సంగీత దర్శకునిగా వ్యవహరించారు.