![Cristiano Ronaldo Breaks Pele Record By Crossing 770 Goals In Football - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/16/Ronaldo.jpg.webp?itok=aSYcRfPq)
మిలాన్ (ఇటలీ): ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఇటలీ ప్రొఫెషనల్ లీగ్ సెరియెలో భాగంగా క్యాలియరి క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువెంటస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 36 ఏళ్ల రొనాల్డో హ్యాట్రిక్ సాధించడంతో ఆ జట్టు 3–1తో గెలిచింది. ఈ మూడు గోల్స్‌తో అధికారికంగా గుర్తింపు పొందిన మ్యాచ్‌లలో రొనాల్డో చేసిన గోల్స్ సంఖ్య 770కు చేరుకుంది.
దాంతో 767 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డు తెర మరుగైంది. రొనాల్డో తన కెరీర్‌లో పోర్చుగల్ తరఫున 120 గోల్స్ సాధించగా... ప్రొఫెషనల్ క్లబ్ జట్ల తరఫున 668 గోల్స్ నమోదు చేశాడు. తన రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డోను పీలే సోషల్ మీడియా ద్వారా అభినందించాడు.
Comments
Please login to add a commentAdd a comment