రోమ్: ఇటలీ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ సాల్వటోర్ స్కిలాచీ(Salvatore Schillaci) బుధవారం కన్నుమూశాడు. 59 ఏళ్ల స్కిలాచీ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. స్వదేశంలో జరిగిన 1990 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో స్కిలాచీ 6 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచి ‘గోల్డెన్ బూట్’ అవార్డు గెలిచాడు.
అదే విధంగా..‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’కి ఇచ్చే ‘గోల్డెన్ బాల్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో ఇటలీ మూడో స్థానం సాధించింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించిన జర్మనీ విజేతగా నిలిచింది. అయితే వ్యక్తిగత ప్రదర్శనతో ఇటలీ స్ట్రయికర్ స్కిలాచీ అభిమానుల్ని అలరించాడు.
చదవండి: మాళవిక సంచలనం
Comments
Please login to add a commentAdd a comment