
పీలే 1000వ గోల్
ఆ నేడు 19 నవంబర్ 1969
ఎడ్సన్ ఆరెంటస్ డొ నాసిమెంటో! ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పోనీ చిన్న క్లూ. ఈ మధ్యే ఈయన కోల్‌కతా వచ్చి వెళ్లారు. చెప్పలేకపోతున్నారా? మరో క్లూ ఏంటంటే... విశ్వవిఖ్యాతుడైన ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ ఆయన. కొంచెం కష్టమే కదా! సరే ఆ పేరును వదిలేద్దాం. పీలే ఎవరో తెలుసా? తెలీకేం బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం అంటారా. ఎస్! ఆయనే ఈయన. పీలే అసలు పేరే.. పైన మీరు చదివిన పేరు. పీలేకు 75 ఏళ్లు. 1940 అక్టోబర్ 23న జన్మించారు.
అయితే అంతకన్నా ప్రాముఖ్యమైన రోజు ఆయన ఫుట్‌బాల్ కెరీర్‌లో ఇంకొకటి ఉంది. అదే నవంబర్ 19. ఆ రోజు ఆయన ఫుట్‌బాల్‌లో తన 1000వ గోల్ కొట్టారు! బ్రెజిల్ నగరం రియో డి జనిరో లోని మరకానా స్టేడియంలో వాస్కో డ గామా టీమ్‌పై పెనాల్టీ కిక్‌తో ఈ చరిత్రాత్మకమైన గోల్ సాధించారు. పీలే 1974లో రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యేనాటికి 1282 గోల్స్ చేశారు. 1363 ఆటలు ఆడారు.