ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం స్పెయిన్, కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిసింది. మ్యాచ్‌లో అన్ని గోల్స్ చేసింది స్పెయిన్ ఆటగాళ్లే కావడం విశేషం. మ్యాచ్‌లో స్పెయిన్ 7-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. స్పెయిన్ తరఫునఫెర్రాన్ టోరెస్ రెండు గోల్స్ చేయగా, ఓల్మో, అసెన్సియో, గవి, సోలెర్, మోరాటా తలో ఒక్క గోల్ చేశారు.
ఈ మ్యాచ్ ద్వారా స్పెయిన్ మిడ్ ఫీల్డర్ గవి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన మూడో పిన్న వయస్కుడిగా నిలిచాడు. వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన అతి పిన్నవయస్కుల జాబితాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే మొదటి స్థానంలో ఉన్నాడు. 1958 వరల్డ్ కప్‌లో పీలే స్వీడన్‌పై 17 సంవత్సరాల 249 రోజుల్లో గోల్ కొట్టాడు.
ఆ తర్వాత 1930 ఆరంభ ఫిఫా వరల్డ్‌కప్‌లో మెక్సికన్ ప్లేయర్ రోసెస్(18 సంవత్సరాల 93 రోజులు) రెండో స్థానంలో నిలిచాడు . బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టిన గవి (18 సంవత్సరాల 110 రోజులు) పిన్న వయస్కుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక వరల్డ్ కప్‌ల పరంగా కోస్టారికాపై గెలుపు స్పెయిన్‌కు అతి పెద్ద విజయం. 2010 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన స్పెయిన్ .. 2018లో రౌండ్ 16లో వెనుదిరిగింది. ఆ వరల్డ్‌కప్‌లో స్పెయిన్ పదో స్థానంలో నిలిచింది.
చదవండి: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు
Comments
Please login to add a commentAdd a comment