కోలుకుంటున్నఫుట్ బాల్ దిగ్గజం పీలే
రియాడిజనీరో: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు చికత్స తీసుకున్నఫుట్ బాల్ దిగ్గజం పీలే(74) కోలుకుంటున్నాడు. కిడ్నీలోని రాళ్ల సమస్యతో బుధవారం సా పాలోస్ ఆల్బర్ట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పీలేకు సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పీలే కోలుకుంటున్నాడని ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి.
కిడ్నీలో రాళ్లను తీసిన వేసిన అనంతరం పీలే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, ఆ తరువాత 2012 లో ఎముక సంబంధింత ఆపరేషన్ చేయించుకున్నాడు.