
ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న గంగూలీ
ఫుట్ బాల్ దిగ్గజం పీలే నగరానికి వచ్చిన సందర్బంగా ఆయన్ను కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు.
కోల్ కతా: ఫుట్ బాల్ దిగ్గజం పీలే నగరానికి వచ్చిన సందర్బంగా ఆయన్ను కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. 1977లో మోహన్ బగాన్‌తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడేందుకు తొలిసారి కోల్‌కతాకు పీలే వచ్చినప్పుడు తాను ఐదు సంవత్సరాలు బాలుడినని.. ఆ సమయంలో పీలేను నల్ల ముత్యంగా అభిమానులు పిలుచుకోవడం తనకు ఇప్పటికీ గుర్తేనన్నాడు.
బ్రెజిల్ ను మూడు సార్లు విశ్వ విజేతగా నిలిపిన పీలే ఆల్ టైం ఫుట్ బాల్ అంబాసిడర్ అంటూ కొనియాడాడు. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు పీలే ఆడే మ్యాచ్ లను క్రమం తప్పకుండా చూసేవాడినని గంగూలీ తెలిపాడు. నిజంగా ఆయన ఆట అద్భుతం అంటూ పీలేపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.