Edinho
-
పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు
సావోపాలో: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న పీలేకు నిజంగా ఇది చేదువార్తే. ఆయన కుమారుడు ఎడిన్హోకు బ్రెజిల్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ సరఫరా ద్వారా సమకూరిన డబ్బును అక్రమంగా రవాణా చేస్తున్నందుకు తను ఈ శిక్షను ఎదుర్కోనున్నాడు. 1990ల్లో సాంటోస్ క్లబ్ తరఫున ఎడిన్హో గోల్ కీపర్‌గా వ్యవహరించాడు. అయితే తాను డ్రగ్స్‌కు బానిసనే కానీ ఆ మాఫియాతో కలిసి పనిచేయడం లేదని 43 ఏళ్ల ఎడిన్హో వాదిస్తున్నాడు. మరోవైపు అతడికి డ్రగ్స్ డాన్ రొనాల్డో నాల్డిన్హోతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శిక్షపై ఎడిన్హో పైకోర్టులో అప్పీల్ చేసుకోనున్నాడు. పీలేకు అతను మూడో సంతానం. -
పీలే కొడుక్కి 33 ఏళ్ల జైలు శిక్ష
శావో పాలో: ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే తనయుడు ఎడిన్హో(43)కు బ్రెజిల్ కోర్టు 33 ఏళ్ల జైలు విధించింది. మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేసే వ్యక్తులతో నగదు బదిలీ వ్యవహారాలు నడిపినందుకు అతడికి కోర్టు ఈ శిక్ష విధించిందని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే తనపై మోపిన అభియోగాలను ఎడిన్హో తోసిపుచ్చాడు. ఫ్రీ పెండింగ్ అప్పీలుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఎడిన్హోతో పాటు మరో ముగ్గురికి కూడా కోర్టు 33 ఏళ్ల చొప్పున కారాగార శిక్ష ఖరారు చేసింది. వీరి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. వీరి వద్దనున్న 100 కార్లను కూడా స్వాధీనం చేసుకోవాలని సూచించింది. రొనాల్డో నాదిన్హో నాయకత్వంలోని ముఠాతో ఎడిన్హో వ్యవహారాలు నడిపినట్టు అభియోగాలు మోపారు. ఈ ముఠా నుంచి మాదకద్రవ్యాలు కొన్నట్టు ఎడిన్హో అంగీకరించాడు. అయితే ఈ ముఠాతో కలిసి పనిచేయలేదన్నాడు.