పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు | Pele’s son Edinho sentenced to 33 years in jail over money-laundering for Santos drug cartel | Sakshi
Sakshi News home page

పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు

Published Mon, Jun 2 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు

పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు

సావోపాలో: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న పీలేకు నిజంగా ఇది చేదువార్తే. ఆయన కుమారుడు ఎడిన్హోకు బ్రెజిల్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ సరఫరా ద్వారా సమకూరిన డబ్బును అక్రమంగా రవాణా చేస్తున్నందుకు తను ఈ శిక్షను ఎదుర్కోనున్నాడు.
 
  1990ల్లో సాంటోస్ క్లబ్ తరఫున ఎడిన్హో గోల్ కీపర్‌గా వ్యవహరించాడు. అయితే తాను డ్రగ్స్‌కు బానిసనే కానీ ఆ మాఫియాతో కలిసి పనిచేయడం లేదని 43 ఏళ్ల ఎడిన్హో వాదిస్తున్నాడు. మరోవైపు అతడికి డ్రగ్స్ డాన్ రొనాల్డో నాల్డిన్హోతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శిక్షపై ఎడిన్హో పైకోర్టులో అప్పీల్ చేసుకోనున్నాడు. పీలేకు అతను మూడో సంతానం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement