ఎరువులకూ ప్రత్యక్ష నగదు బదిలీ!: రైతులకు ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించే అంశాన్ని ప్రభుత్వం
ఎరువులకూ ప్రత్యక్ష నగదు బదిలీ!: రైతులకు ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్ కుమార్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. ఆత్మహత్యాయత్నం నేరం కాదు: ఆత్మహత్యా యత్నాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లోక్‌సభకు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఏడాది జైలు శిక్ష పడుతున్న ఈ యత్నం ఇక నేరం కాబోదన్నారు.
పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు 685: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో గత 8 నెలల్లో పాకిస్తాన్ 685 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు తెలిపారు. ఈ కాల్పుల్లో 8 మంది భద్రతా సిబ్బంది 16 మంది పౌరులు చనిపోయారని వెల్లడించారు.
స్వైన్‌ఫ్లూ మరణాలు 841: స్వైన్‌ఫ్లూతో ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 22 మధ్య దేశంలో 841 మంది చనిపోయారని, 14,673 మందికి ఆ వ్యాధి సోకిందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారు.
నల్లధన ం నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: నల్లధన నియంత్రణకు ప్రభుత్వం సాధ్యమైన చర్యలన్నింటినీ తీసుకుంటోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ఆస్తుల వె ల్లడి తదితరాలకు సంబంధించి ఐటీ చట్టంలోని 139 సెక్షన్‌లో సవరణ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు.