కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రూ.10.29 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ సోమవారం పేర్కొంది. ఆల్కెమిస్ట్ గ్రూప్, ఇతరులు చేసిన మనీలాండరింగ్ నేరంపై విచారణ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 10.29 కోట్లను ఈడీ టెండర్ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) రూపంలో అటాచ్ చేసింది.
2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ఉపయోగించిన విమాన/హెలికాప్టర్ సేవలకు పలు విమానయాన కంపెనీలకు ఆల్కెమిస్ట్ గ్రూప్ దాదాపు రూ.10.29 కోట్లు చెల్లించినట్లు ఈడీ పేర్కొంది. ఇక.. అప్పటి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు అయిన.. సీఎం మమతా బెనర్జీ, పార్టీ ఎమ్మెల్యే, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్, నటుడు మూన్‌మూన్ సేన్, ఎంపీ నుస్రత్ జహాన్ కోసం టీఎంసీ విమాన సేవలు ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది.
ప్రజల డబ్బులో కొంత సొమ్మును టీఎంసీ ప్రచారంలో విమానయాన కంపెనీలకు చెల్లించేందుకు సదరు ఆల్కెమిస్ట్ గ్రూప్‌ను ఉపయోగించుకున్నట్లు ఈడీ విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఆల్కెమిస్ట్ గ్రూప్.. టీఎంసీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేడీ సింగ్‌ది కావటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment