
చిదంబరం కుమారుడికి ఈడీ నోటీసులు
మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీలాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో ఆయన దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. రెండు వారాల్లో స్వయంగా లేదా తన అధికార ప్రతినిధి ద్వారా డాక్యుమెంట్లను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది.