సీఈఐబీకి ఆర్‌బీఐ బ్యాంకుల తనిఖీ వివరాలు | Money laundering: RBI to share banks' inspection report | Sakshi
Sakshi News home page

సీఈఐబీకి ఆర్‌బీఐ బ్యాంకుల తనిఖీ వివరాలు

Published Wed, Jan 6 2016 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

సీఈఐబీకి ఆర్‌బీఐ బ్యాంకుల తనిఖీ వివరాలు

సీఈఐబీకి ఆర్‌బీఐ బ్యాంకుల తనిఖీ వివరాలు

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ను నిరోధించేందుకు, బ్యాంకింగ్ చట్టాల ఉల్లంఘనను కట్టడి చేసే దిశగా బ్యాంకుల తనిఖీల నివేదికల వివరాలను సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ)కి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి సీఈఐబీ, ఆర్‌బీఐ త్వరలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. సీఈఐబీ.. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (ఈఐసీ)తో సమావేశాల్లో అనేక మార్లు ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ.. చట్టపరమైన ఆటంకాల పేరుతో తనిఖీ నివేదికల వివరాలు సీఈఐబీకి ఇచ్చేందుకు ఆర్‌బీఐ నిరాకరిస్తూ వస్తోంది.

దీంతో ఈ అంశం న్యాయ శాఖ వద్దకు చేరింది. బ్యాంకుల తనిఖీల నివేదికల వివరాలను సీఈఐబీ వంటి ఏజెన్సీలకు ఇచ్చే విషయంలో ఆర్‌బీఐని నిరోధించే  నిబంధనలేమీ లేవని న్యాయశాఖ తేల్చి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement