న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంట గ్యాస్(ఎల్పీజీ) నగదు బదిలీ పథకంలోకి 10 కోట్ల మంది లబ్ధిదారులు చేరారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకంగా ఈ స్కీం రికార్డు సృష్టించిందని తెలిపారు. ‘పహల్ యోజన’లోకి రెండు నెలల్లోనే 10 కోట్ల మంది చేరడం తనకు గొప్ప సంతోషం కలిగిస్తోందని ప్రధాని ట్వీటర్‌లో పేర్కొన్నారు. నగదు బదిలీ పథకంతో బ్లాక్ మార్కెటింగ్‌కు ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.