మనీలాండరింగ్ నిబంధనలకు పదును
ముంబై: మనీలాండరింగ్‌కు చెక్ పెట్టే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకు మరింత పదును పెట్టింది. క్యాపిటల్ మార్కెట్ల ద్వారా టైస్ట్ కార్యకలాపాలకు నిధులు అందకుండా నివారించేందుకు వీలుగా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీనిలో భాగంగా మార్కెట్ తమ క్లయింట్ల రిస్క్ అసెస్‌మెంట్‌కు సంబంధించిన వివరాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టమంటూ ఇంటర్మీడియరీలను ఆదేశించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆంక్షలకు గురైన దేశాలతో సంబంధం కలిగిన క్లయింట్ల విషయంలో మరింత పరిశోధన చేపట్టమంటూ సూచించింది. తాజా నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు వీలుగా అవసరమైన డెరైక్టర్లను నియమించుకోమంటూ సలహా ఇచ్చింది. ఏవైనా పొరపాట్లు జరిగితే ఈ డెరైక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది.
ఎక్స్ఛేంజీలకూ ఆదేశాలు
మరోవైపు వివిధ ఇంటర్మీడియరీలు నిబంధనలను ఏవిధంగా అమలు చేస్తున్నదీ పర్యవేక్షించడంతోపాటు అర్ధ వార్షిక అంతర్గత ఆడిట్ నివేదికలను పరిశీలించడం వంటివి చేయాల్సిందిగా స్టాక్ ఎక్స్ఛేంజీలను సైతం సెబీ ఆదేశించింది. అవసరమైనప్పుడల్లా వీటిపై తమకు సమాచారాన్ని అందించడం వంటి పనులు చేపట్టాల్సిందిగా ఎక్స్ఛేంజీలకు సూచించింది. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనీ లాండరింగ్ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశముంది.
ఈ నేపథ్యంలోనే సెబీ నిబంధనలను కఠినతరం చేసింది. నిబంధనల్లో భాగంగా బిజినెస్ నుంచి క్లయింట్లు వైదొలగినప్పటికీ, ఖాతా రికార్డులను ఐదేళ్లపాటు భద్రపరచవలసి ఉంటుంది. ఇక క్లయింట్ వివరాలైతే పదేళ్లపాటు జాగ్రత్తపెట్టాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ కాపీలు, డ్రైవింగ్ లెసైన్స్‌లు తదితర క్లయింట్ల గుర్తింపు కార్డులతోపాటు, ఖాతాల ద్వారా లబ్ధి పొందే వ్యక్తుల వివరాలను ఏళ్లపాటు ఇంటర్మీడియరీ సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే క్లయింట్లకు సంబంధించిన గుర్తింపు తదితర సమాచారాన్ని అవసరమైతే థర్డ్‌పార్టీ ద్వారా విశ్లేషించుకునే వెసులుబాటు ఇంటర్మీడియరీలకు ఉంటుంది.