సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అక్రమ డబ్బు రవాణాను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారులు ఎవరైనా రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్, విత్ డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది.
ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును ఖాతాదారుడు తీసుకున్నా జిల్లా ఎన్నికల అధికారికి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి తెలపాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పేరుతో లేదా ఏజెంట్ పేరుతో కలిపి బ్యాంకు, పోస్టాఫీసుల్లో ప్రత్యేకంగా అకౌంట్ లేదా ఉమ్మడి అకౌంట్ తెరవవచ్చని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అన్ని బ్యాంకులకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment