issued guidelines
-
నగదు లావాదేవీల సమాచారమివ్వండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అక్రమ డబ్బు రవాణాను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారులు ఎవరైనా రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్, విత్ డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును ఖాతాదారుడు తీసుకున్నా జిల్లా ఎన్నికల అధికారికి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి తెలపాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పేరుతో లేదా ఏజెంట్ పేరుతో కలిపి బ్యాంకు, పోస్టాఫీసుల్లో ప్రత్యేకంగా అకౌంట్ లేదా ఉమ్మడి అకౌంట్ తెరవవచ్చని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అన్ని బ్యాంకులకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
లక్షణాల్లేకుంటేనే పరీక్ష హాల్లోకి..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నీట్ సహా పలు పరీక్షలు ఈ నెలలో జరగనుండటంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు లేని వారినే పరీక్ష హాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని విద్యార్థులు, సిబ్బందినే పరీక్ష హాలులోకి అనుమతించాలని ఆదేశించింది. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే సమీప ఆరోగ్య కేంద్రానికి పంపాలని, వారు వేరే విధానం ద్వారా పరీక్షలు రాసేలా చూడాలని సూచించింది. ఒకవేళ లక్షణాలు బయటపడిన తర్వాత కూడా వారు పరీక్ష రాస్తామంటే ప్రత్యేక ఐసోలేషన్ గదిలో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రెగ్యులర్ కోర్సుల విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలుంటే వారు కోలుకున్నాక మళ్లీ పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేయాలని కోరింది. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడే విద్యార్థులు వారి ఆరోగ్య పరిస్థితిపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, అలా ఇవ్వని వారిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని, ఆ జోన్లలోని సిబ్బంది, విద్యార్థులను కూడా పరీక్షా కేంద్రాలకు రానీయకూడదని ఆదేశించింది. అలాంటి విద్యార్థులకు ఇతరత్రా పద్ధతుల ద్వారా పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని, లేదంటే మరోసారి పరీక్షలు నిర్వహించేలా సన్నాహాలు చేయాలని సూచించింది. మరికొన్ని మార్గదర్శకాలు ► మాస్క్‌లు ఉపయోగిస్తేనే సిబ్బంది, విద్యార్థులను పరీక్షా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. మాస్క్‌ను పరీక్ష అయిపోయేంత వరకు ధరించాలి. ► వయసు పైబడిన ఉద్యోగులు, సిబ్బంది, గర్భిణులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్న వారిని పరీక్ష విధుల్లో నియమించకూడదు. ► విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలి. ► పరీక్ష కేంద్రాల వద్ద జనం గుమిగూడకుండా దశలవారీగా పరీక్షలను నిర్వహించాలి. ► పరీక్షా కేంద్రాల్లో మాస్క్‌లు, శానిటైజర్ల వంటివి సమకూర్చుకోవాలి. ► కరోనా నిబంధనలను విద్యార్థులకు చెప్పాలి. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ► పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అందరినీ థర్మల్ స్క్రీన్ చేయాలి. ► తనిఖీ చేసే సిబ్బంది తప్పనిసరిగా త్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ► ఏసీ 24–30 డిగ్రీల మధ్యే ఉండాలి. ► ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ► పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చే వాహనాలను ముందే శానిటైజ్ చేయాలి. ► పరీక్ష కేంద్రంలోకి బ్యాగులు, పుస్తకా లు, ఫోన్లను అనుమతించకూడదు. ► అనారోగ్యానికి గురైతే తీసుకెళ్లేలా వీల్‌చైర్ సదుపాయం కల్పించాలి. ► ప్రశ్న, జవాబుపత్రాల పంపిణీకి ముం దు ఇన్విజిలేటర్లు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. వాటిని తిరిగి ఇన్విజిలేటర్లకు అప్పగించే ముందు విద్యార్థులు కూడా శానిటైజ్ చేసుకోవాలి. ► ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరిగితే పరికరాలను సంబంధిత ద్రావణంతో తుడవాలి. -
వైరస్‌పై యుద్ధం.. ఇలా చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటం చేయాలంటే జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే సరిపోదు. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మందు మరేదీ లేదు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించాలని, జనం సమూహాలుగా ఏర్పడరాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ క్రమంలో అత్యవసర పనులపై బయటకు వచ్చి.. తిరిగి ఇళ్లకు చేరుకునే విషయంలో, సరుకుల కొనుగోలు, ఇతర సమయాల్లో ప్రజలు అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీచేసింది. ఈ సలహా సూచనలను కుటుంబంలోని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టంచేసింది. పోషకాహారం.. యోగాసనాలు కరోనా వైరస్ కట్టడికి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో చికిత్స అందించి రోగం తీవ్రతను తగ్గిస్తున్నప్పటికీ సరైన మందులు అందుబాటులో లేవు. అందువల్ల సరైన ఆహారం తీసుకుంటూ శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా కరోనాను జయించవచ్చు. రోజూ కనీసం 30నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం వంటివి ఆచరించాలి. మాస్క్, శానిటైజర్, భౌతికదూరం.. ► ఇంటి బయటకు వెళ్లేముందు ట్రిపుల్ లేయర్ లేదా ఎన్–95 లేదా సర్జికల్ మాస్క్ తప్పక ధరించాలి. కాలికి ప్లాస్టిక్ స్లిప్పర్లు వేసుకోవాలి. ► సరుకుల కోసం సంచి లేదా ప్లాస్టిక్ బాస్కెట్ తీసుకెళ్లాలి. మార్కెట్లో/బయట వివిధ ఉపరితలాలను తాకకుండా జాగ్రత్త పడాలి. ► దుకాణాదారు లేదా ఇతరులకు కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి. మార్కెట్‌కు వెళ్లేవారు వెంట హ్యాండ్ శానిటైజర్‌ను తీసుకెళ్లాలి. ► అత్యవసరమైతేనే మార్కెట్‌కు వెళ్లాలి. వారంలో రెండుసార్లకు మించి వెళ్లకపోవడం మంచిది. ► ఏటీఎంలో నగదు డ్రా చేయాలంటే ముందు మిషన్ కీబోర్డును శానిటైజ్ చేయాలి. కార్డు వినియోగించాక కూడా శానిటైజర్‌తో శుభ్రంచేయాలి. ► ఇంట్లో ఉన్నప్పుడు కరోనా లక్షణాలు లేని వారు మాస్కు వాడనవసరం లేదు. లిఫ్ట్ వద్దు.. మెట్లే ముద్దు ► ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర భవనాల్లో లిఫ్ట్ వాడకాన్ని తగ్గించాలి. ఎక్కువ మంది దీన్ని విని యోగించడం, తక్కువ విస్తీర్ణం గల వీటిలో భౌతికదూరం పాటించడం కష్టం కాబట్టి.. మెట్లు వాడాలి. ూ ► వాడటం తప్పనిసరైతే పేపర్ ముక్కల ద్వారా బటన్లు నొక్కి.. ఆపై వాటిని డస్ట్‌బిన్ లో పారేయాలి. ూ ఇంట్లోకి వెళ్లే ముందు ఎక్కడా, ఎలాంటి ఉపరితలాలను తాకకూడదు. నేరుగా బాత్రూమ్కు వెళ్లి బట్టలు వదిలేసి స్నానం చేయాలి (ఎక్కువ మందిని తక్కువ దూ రంతో తాకినట్టు భావిస్తే). లేదంటే చేతులు, ము ఖాన్ని సబ్బు/హ్యాండ్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. ► చెప్పులను కూడా శుభ్రం చేసుకోవాలి. ► ఇంట్లోకి బయటి వ్యక్తులను అనుమతించేటప్పుడు వారి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాలి. సమస్య లేకుంటే, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే వారిని లోనికి అనుమతించాలి. ఇంటి పరిశుభ్రత ఇలా... ► ఇళ్లను రోజూ డిటర్జెంట్ ఉన్న ద్రావణంతో శుభ్రం చేయాలి. ముఖద్వారంతో పాటు కాలింగ్‌బెల్‌ను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. ► సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో చేతులను 20 సెకన్లపాటు రుద్ది కడుక్కోవాలి. ► మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు, పాలప్యాకెట్లను ఉప్పు/బేకింగ్ సోడాలో 2శాతం డిటర్జెంట్ ద్రావణంతో కలిపి కడిగి శుభ్రం చేయాలి. ► ఇంట్లోకి తెచ్చిన ఇతర వస్తువులను.. 72 గంటల అనంతరం వినియోగించడం మంచిది. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయొద్దు. వైరస్ ఏ ఉపరితలంపై ఎంతకాలం ఉంటుందంటే.. అల్యూమినియం: 2–8 గంటలు చెక్క: 4 రోజులు ప్లాస్టిక్: 2–5 రోజులు మెటల్: 5 రోజులు సెరామిక్: 5 రోజులు స్టీల్: 2–28 రోజులు గ్లాస్: 4–5 రోజులు -
‘లెక్క’ తప్పింది!
♦ కాసులు కురిపించని క్రమబద్ధీకరణ ♦ ప్రభుత్వ అంచనాలు తారుమారు ♦ మార్గదర్శకాల్లో కొరవడిన స్పష్టత ♦ నిర్దేశిత మొత్తం చెల్లించేందుకు వెనుకడుగు ♦ మరోసారి గడువు పెంచే యోచనలో సర్కారు మొత్తం దరఖాస్తులు 11,846 అర్హమైనవి 6,746 తిరస్కరించినవి 4,872 రావాల్సిన ఆదాయం రూ.243 కోట్లు ఇప్పటివరకు వచ్చింది రూ.88.36 కోట్లు భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ గాడితప్పింది. కాసుల వర్షం కురిపిస్తుందని భావించిన సర్కారు లెక్క తారుమారైంది. మార్గదర్శకాల జారీలో జాప్యం.. దరఖాస్తుల పరిశీలనలో సాంకేతికపరమైన ఇబ్బందులు.. డీడీల రూపేణా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనతో అసలుకే ఎసరొచ్చింది. దీంతో జిల్లావ్యాప్తంగా రూ. 243.99 కోట్ల ఆదాయం రావాల్సిఉండగా, కేవలం రూ.88.36 కోట్లు మాత్రమే జమ అయ్యింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చెల్లింపు కేటగిరీ (జీఓ 59) కింద జిల్లాలో 11,846 దరఖాస్తులు అధికార యంత్రాంగానికి అందాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన రెవెన్యూ అధికారులు 6,746 అర్జీలు క్రమబద్ధీకరణకు అర్హత కలిగిన విగా తేల్చారు. 4,872 దరఖాస్తులను తిరస్కరించింది. అయితే, క్రమబద్ధీకరణకు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు మొగ్గు చూపలేదు. అధికార యంత్రాంగం సృష్టించిన గంద రగోళమే ఇందుకు కారణం. ఏకమొత్తం చెల్లించిన దరఖాస్తులకు కూడా మోక్షం కలగకపోవడంతో క్రమబద్ధీకరణపై మీమాంసకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశించినట్లు క్రమబద్ధీకరణ ఖజానాకు కాసుల వర్షాన్ని కురిపించలేకపోయింది. భారీగా ఆశలు.. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాలను క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించింది. శివార్లలో భూముల విలువలు ఆకాశన్నంటినందున.. వీటిని విలువ ఆధారంగా పెద్దఎత్తున రాబడి వస్తుందని లెక్క గట్టింది. అయితే, క్రమబద్ధీకరణకు సంబంధించిన చెల్లింపులకు డిమాండ్ డ్రాఫ్ట్‌లను ముడిపెట్టడంతో చాలా ఆక్రమణదారులు వెనక్కి తగ్గారు. ప్రతి చెల్లింపుపై ఆదాయశాఖ (ఐటీ) నిఘా ఉంటుందని భావించి దరఖాస్తు చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మార్కెట్ విలువకు అనుగుణంగా కనీస ధరలను నిర్ధేశించడం కూడా వెనుకడుగు వేసేందుకు కారణమైంది. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా 11,846 మంది స్థలాల రెగ్యులరైజేషన్‌కు అర్జీలు పెట్టుకున్నారు. ఈ మేరకు రూ.133 కోట్లను చెల్లించారు. దీంట్లో 628 మంది ఏకమొత్తంలో నిర్దేశిత ఫీజులను కూడా కట్టారు. అయితే, దరఖాస్తుల వడపోతలో చాలావరకు ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురయ్యాయి. వాస్తవానికి ఆమోదం పొందిన దరఖాస్తులతో ఖజానాకు రూ.243 కోట్లు వస్తాయని లెక్క గట్టింది. విధివిధానాల ఖ రారులో అస్పష్టత, మార్గదర్శకాలను సకాలంలో వెలువరించకపోవడం, యాజమాన్య హక్కుల (కన్వియెన్స్డీడ్)లు కల్పించకపోవడంతో క్రమబద్ధీకరణ విషయంలో అర్జీదారుల్లో సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. దీంతో అర్హత సాధించిన దరఖాస్తుదారులు కూడా నిర్దేశిత ఫీజుల చెల్లింపుపై వేచిచూసే ధోరణిని అవలంబించారు. ఈ క్రమంలోనే తుది గడువు (ఫిబ్రవరి 29) కాస్తా ముగిసింది. ఈ పరిణామాలతో ఇప్పటివరకు రూ.88.36 కోట్లు మాత్రమే ప్రభుత్వ పద్దుకు చేరాయి. దీంట్లో జనవరిలో రూ.78.79 కోట్లు, ఫిబ్రవరిలో రూ.9.41 కోట్లు, గడువు ముగిసిన తర్వాత అంటే మార్చిలో రూ.15.97 లక్షలు ఖజానాకు జమ అయ్యాయి. మరోసారి గడువు పొడిగింపు? భూ క్రమబద్ధీకరణ (జీఓ 59) గడువును మరోసారి పొడగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దడానికి సాంకేతిక సమస్యలు తలెత్తడం, కన్వియెన్స్ డీడ్ ఖరారు కాకపోవడం, ఇతరత్రా పాలనాపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఈ దిశగా ఆలోచ న చేస్తోంది. మరోవైపు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా స్థలాల రెగ్యులరైజ్‌కు ఆసక్తి చూపకపోవడాన్ని క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని విశ్లేషించుకున్న ఉన్నతాధికారులు.. గడువు పొడగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వ్యవధి పొడగింపు ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి కూడా సంకేతాలు పంపిన ప్రభుత్వం.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది.