కౌలాలంపూర్: భారత్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్‌నాయక్ మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్‌ను కలిశారు. ఉగ్ర కార్యకలాపాలు, మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులు ఉండటంతో ఆయన్ను అప్పగించాలని మలేసియా ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అయితే, ఆయన్ను పంపబోమని ప్రధాని మహతీర్ శనివారం ప్రకటించడం తెల్సిందే. ప్రధాని మహతీర్‌తో జకీర్ సంక్షిప్త భేటీలో ఏం మాట్లాడారన్న విషయం వెల్లడికాలేదు.
అయితే, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార పార్టీ సమర్ధించిందని మీడియా తెలిపింది. జకీర్‌నాయక్‌కు మలేసియాలో శాశ్వత నివాస హోదా ఉంది. దాని ప్రకారం అక్కడి చట్టాలను ఉల్లంఘించనంత వరకు నివాసం ఉండే హక్కు ఉంటుంది. భారత్ కోర్టుల్లో జకీర్‌పై నేరారోపణలు నమోదయితేనే రెండు దేశాల మధ్య ఉన్న నేరస్తుల మార్పిడి ఒప్పందం అమల్లోకి వస్తుందని ఆయన లాయర్ షహరుద్దీన్ తెలిపారు. జకీర్ విషయంలో ప్రధాని‡ నిర్ణయం సరైందేనని అధికార పార్టీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment