న్యూఢిల్లీ: మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిశీలనకు పంపించనున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్‌కు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు జూన్ ఒకటో తేదీ వరకు బెయిలిచ్చిన విషయం తెల్సిందే.
జూన్ 2వ తేదీన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. మంగళవారం కేజ్రీవాల్ పి టిషన్ వెకేషన్ బెంచ్‌లోని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విశ్వనాథన్‌ల ముందుకు వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ కొన్ని అత్యవసర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని, బెయిల్ మరో వారం పొడిగించాలంటూ ఆయన తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి కోరారు. పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టాలని తెలిపారు. అయితే, ధర్మాసనం ‘వాదనలు విన్నాం. తీర్పు రిజర్వు చేశాం. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచుతున్నాం’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment