శాఖ గ్రామీణ వికాస్ బ్యాంక్ తిలారు బ్రాంచ్‌కు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై జలుమూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదురాలు చెం^è ల రత్నకుమారి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. టి.లింగాలుపాడుకు చెందిన చెంచల రత్నకుమారి 2014 జూలై నెలలో శ్రీవిశాఖ గ్రామీణ వికాస్ మినీ బ్యాంక్‌లో ఖాతా ప్రారంభించింది. గృహ నిర్మాణం నగదు మూడు పర్యాయాలు 60,800 నగదు ఆమె
నిధుల స్వాహాపై ఫిర్యాదు
Published Tue, Aug 16 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
జలుమూరు : విశాఖ గ్రామీణ వికాస్ బ్యాంక్ తిలారు బ్రాంచ్‌కు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై జలుమూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదురాలు చెం^è ల రత్నకుమారి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. టి.లింగాలుపాడుకు చెందిన చెంచల రత్నకుమారి 2014 జూలై నెలలో శ్రీవిశాఖ గ్రామీణ వికాస్ మినీ బ్యాంక్‌లో ఖాతా ప్రారంభించింది. గృహ నిర్మాణం నగదు మూడు పర్యాయాలు 60,800 నగదు ఆమె ఖాతా జమ అయింది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మినీ బ్యాంక్ సర్వీసు ప్రొవైడర్ వాన ముకుందరావు, రత్నకుమారి ఖాతా నుంచి 8–8–2015న రూ. 4,560, రూ.5.440, అలాగే 9–8–2015న రూ 3,300, రూ.6,300, మళ్లీ అదే నెల 11, 13, 16, 17 తేదీల్లో వరుసుగా రూ.10 వేలు, 21న రూ.4వేలు మొత్తం సుమారు రూ.64 వేలు డ్రా చేసినట్లు పిర్యాదులో పేర్కొంది. దీనిపై హెచ్‌సీ బి.గణపతిని వివరణ కోరగా టి.లింగాలుపాడు మినీ బ్రాంచ్ నుంచి రత్నకుమారీ ఖాతా నుంచి నిధులు డ్రాచేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు.
అయితే గ్రామ పెద్దలు రాజీ చేసి అదే ఖాతాకు ఆ నిధులు జమచేసినట్లు రశీదు చూపించారన్నారు. ఎస్‌ఐ లేని కారణంగా 26న స్టేషన్‌కు రమ్మని చెప్పామన్నారు. దీనిపై తిలారు బ్రాంచ్ మేనేజర్ ప్రజ్ఞ మాట్లాడుతూ టి.లింగాలుపాడు మినీ బ్రాంచ్ కస్టమర్ సర్వీసు ప్రొవైడర్(సీఎస్‌పీ) నిధులు డ్రా చేసినట్లు సమాచారం వచ్చిందని శాఖ పరంగా ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement