
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరిMీ ఐదు వేల రూపాయలు చొప్పున ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (ఎఫ్‌సీఏ) ఆర్థిక సాయం చేసింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి మొత్తం 87 మంది సభ్యులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా సోమవారం ఐదు వేల నగదును బదిలీ చేశారు. ‘‘ఎఫ్‌సీఏ’ అడ్వైజర్ కమిటీ కన్వీనర్ మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావుగారి సలహాల మేరకు, హెల్త్ కమిటీ చైర్మన్ రెడ్డి హనుమంతురావు, మురళి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment