FCA
-
సినిమా జర్నలిస్ట్‌లకు ఎఫ్సీఏ సాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరిMీ ఐదు వేల రూపాయలు చొప్పున ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (ఎఫ్సీఏ) ఆర్థిక సాయం చేసింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి మొత్తం 87 మంది సభ్యులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా సోమవారం ఐదు వేల నగదును బదిలీ చేశారు. ‘‘ఎఫ్సీఏ’ అడ్వైజర్ కమిటీ కన్వీనర్ మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావుగారి సలహాల మేరకు, హెల్త్ కమిటీ చైర్మన్ రెడ్డి హనుమంతురావు, మురళి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు. -
కెనరా బ్యాంకుకు భారీ జరిమానా
భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంకుకు యూకే రెగ్యులేటరీ భారీ షాక్ ఇచ్చింది. యాంటీ మనీలాండరింగ్ నిబంధనలను పాటించని కారణంగా బ్యాంకుకు చెందిన లండన్ బ్రాంచ్‌లో యూకే ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటర్(ఎఫ్సీఏ) 896,100 పౌండ్లు (సుమారు రూ.8 కోట్లు) జరిమానా విధించింది. అంతేకాదు దాదాపు 5 నెలలు డిపాజిట్లను స్వీకరించకుండా నిలిపివేసింది. కొత్త ఖాతాదారుల నుండి 147 రోజులు పాటు డిపాజిట్లను నిషేధించింది. కెనరా బ్యాంక్ నవంబర్ 26, 2012, జనవరి 29, 2016 మధ్యకాలంలో ప్రిన్సిపల్ 3 (యాజమాన్యం అండ్ కంట్రోల్) ఉల్లంఘించిన కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు ఎఫ్సీఏ తన నోటీసులో తెలిపింది. అంతేకాదు ఎఫ్సీఏ విచారణను ప్రారంభ దశలోనే సెటిల్ చేసుకునేందుకు అంగీకరించినందున పెనాల్టీని 30 శాతం తగ్గించినట్టు తెలిపింది. లేదంటే పెనాల్టీ 1280175పౌండ్లు( సుమారు రూ.11కోట్లు) గాను, డిపాజిట్లను స్వీకరణపై నిషేధం 210 రోజులుగానూ ఉండేది. -
జీప్ మోడల్ ధర తగ్గించిన ఫియట్
రూ.18.49 లక్షల వరకు కోత న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్’ (ఎఫ్సీఏ) తాజాగా తన జీప్ మోడల్ వాహన ధరలను రూ.18.49 లక్షల వరకు తగ్గించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. డీజిల్ ఇంజిన్ రాంగ్లర్ (ఆన్లిమిటెడ్) ధరను రూ.7.14 లక్షల మేర తగ్గించింది. దీంతో దీని ధర రూ.71.59 లక్షల నుంచి రూ.64.45 లక్షలకు తగ్గింది. గ్రాండ్ చెరోకీ (లిమిటెడ్) డీజిల్ వేరియంట్ ధరలో ఏకంగా రూ.18.49 లక్షలు కోత విధించింది. దీంతో దీని ధర రూ.93.64 లక్షల నుంచి రూ.75.15 లక్షలకు దిగివచ్చింది. డీజిల్ ఇంజిన్ గ్రాండ్ చెరోకీ (సమిట్) ధర కూడా రూ.18.24 లక్షలు తగ్గింది. దీని ధర రూ.1.03 కోట్ల నుంచి రూ.85.15 లక్షలకు దిగివచ్చింది. గ్రాండ్ చెరోకీ ఎస్ఆర్టీ ధరలో రూ.5 లక్షల కోత విధించింది. దీంతో దీని ధర రూ.1.07 కోట్లుగా ఉంది. ఇక పెట్రోల్ ఇంజిన్ రాంగ్లర్ (అన్లిమిటెడ్) ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీని ధర రూ.56 లక్షలుగానే ఉంది. కాగా కంపెనీ తాజాగా గ్రాండ్ చెరోకీ మోడల్లో పెట్రోల్ వెర్షన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.75.15 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. -
జాతీయ అవార్డు విజేతలను సత్కరించిన ఎఫ్సిఏ
-
ఫియట్ కార్ల ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఇతర వాహన కంపెనీలన్నీ వాటి కార్ల ధరల పెంపులో నిమగ్నమై ఉంటే.. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్సీఏ) ఇండియా మాత్రం వీటికి భిన్నంగా మరంత మంది కస్టమర్ల ఆకర్షించడం కోసం కార్ల ధరల్లో కోత విధించింది. తన సెడాన్ కారు లీనియా ధరను 7.3 శాతం వరకు (రూ.77,121 వరకు).. హ్యాచ్‌బ్యాక్ కారు పుంటో ఈవో ధరను దాదాపు 7 శాతం వరకు (రూ.47,365 వరకు) తగ్గించింది. దీంతో లీనియా కార్ల ధర రూ.7.25 లక్షల నుంచి రూ.9.99 లక్షల శ్రేణికి తగ్గింది. కాగా వీటి ఇదివరకు ధర రూ.7.82 లక్షల నుంచి రూ.10.76 లక్షల శ్రేణిలో ఉంది. ఇక పుంటో ఈవో కార్ల ధర కూడా రూ.5.45 లక్షలు – రూ.7.55 లక్షల శ్రేణికి తగ్గింది. వీటి ఇదివరకు ధర రూ.5.85 లక్షలు– రూ.7.92 లక్షల శ్రేణిలో ఉంది. కాగా ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.