న్యూఢిల్లీ: దేశంలో అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసింది. వీరిలో పలు కార్పొరేట్ సంస్థల డైరెక్టర్లున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.
‘‘కార్పొరేట్ మోసాలకు సంబంధించి స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులపై ఈడీ కేసులు పెట్టింది. రూ.33,862.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వీటిలో రూ.15,113 కోట్ల ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులు అధీనంలోకి తీసుకున్నాయి. ఈడీ అప్పగించిన ఆస్తులను ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విక్రయించి రూ.7,975.27 కోట్లు ఆర్జించింది’’ అని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment