రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో కాన్‌మన్ సుకేశ్ చంద్రశేఖర్‌పై బాలీవుడ్ తారల ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అతనిపై నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా మరోనటి అతనిపై విమర్శలు చేసింది. తీహార్ జైలులో ఉన్నప్పుడు సుకేశ్ చంద్రశేఖర్ తనకు ప్రపోజ్ చేశాడని నటి చాహత్ ఖన్నా ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు తీహార్ జైలు వీడియోతో తనను బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షల డిమాండ్ చేశారని చాహత్ పేర్కొన్నారు. సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు విచారణ సమయంలో ప్రముఖంగా వినిపించిన బుల్లితెర నటి పేరు చాహత్ కన్నా. దీంతో ఆమె సుకేశ్ తనను మోసం చేశాడని.. తీహార్ జైలులోనే తనకు ప్రపోజ్ చేశాడని పేర్కొంది.
ఎంజెల్ నన్ను మోసం చేసింది
సుకేశ్ సహాయకురాలు పింకీ ఇరానీ తనను ఏంజెల్ ఖాన్‌గా పరిచయం చేసుకుని.. దిల్లీలో ఓ స్కూల్ ఈవెంట్‌కు తనను ఆహ్వానించినట్లు చాహత్ చెప్పారు. అయితే ఆమె తనను దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా తీహార్ జైలుకు తీసుకువెళ్లిందని.. అక్కడ ఆమె సుకేష్‌ను కలిసిందని చెప్పింది. ఏంజెల్ తనకు డబ్బు, ఖరీదైన బహుమతులు ఆశ చూపిందని పేర్కొంది. అయితే ఆ తర్వాత కొంతమంది తెలియని వ్యక్తులు తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆమె వెల్లడించింది.
పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు
తనను తీహార్ జైలుకు తీసుకెళ్లినప్పుడు విడిచిపెట్టమని ఏంజెల్‌ను వేడుకున్నానని చాహత్ తెలిపారు. తీహార్ జైలులోని ఒక చిన్న గదికి తనను తీసుకెళ్లి.. ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, వాచీలు, లగ్జరీ బ్యాగ్‌లు ఆశ చూపారని వెల్లడించింది. 'బడే అచ్ఛే లాగ్తే హై' సిరీస్ చూసిన తర్వాత నేను మీ అభిమానిగా మారానని సుకేశ్ అన్నాడని చాహత్ తెలిపింది. సుకేశ్ మోకాళ్లపై నిలబడి వివాహం చేసుకోవాలని తనకు ప్రపోజ్ చేశాడని వివరించింది.
చాహత్ ఖన్నా మాట్లాడుతూ..' నాకు పెళ్లయింది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనితో గట్టిగా అరిచా. నేను చాలా ఆందోళన చెందా. ఆ తర్వాత నేను ఏడవటం మొదలుపెట్టా.'ఆమె నటి చాహత్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment