8 కార్పొరేషన్లకు చైర్మన్లు.. | Chairmens for the 8 corporations | Sakshi
Sakshi News home page

8 కార్పొరేషన్లకు చైర్మన్లు..

Published Tue, May 30 2017 2:56 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

8 కార్పొరేషన్లకు చైర్మన్లు.. - Sakshi

8 కార్పొరేషన్లకు చైర్మన్లు..

- యువతకు, ఉద్యమ నేతలకు అవకాశమిచ్చిన కేసీఆర్‌
టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలిగా గుండు సుధారాణి
విద్యార్థి సమితి అధ్యక్షుడిగా శ్రీనివాసయాదవ్‌
 
సాక్షి, హైదరాబాద్‌: నామినేటేడ్‌ పదవుల భర్తీలో భాగంగా సీఎం కేసీఆర్‌ సోమవారం రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. వాటితో పాటు టీఆర్‌ఎస్‌ మహిళా, విద్యార్థి విభాగాల అధ్యక్షులనూ ప్రకటించారు. ఈ నియామకాల్లో యువతకు, ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్ర పోషించిన నాయకులకు అవకాశమిచ్చారు. ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా.. మరో పదవి కోసం మెదక్‌ డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఎలక్షన్‌రెడ్డి పేరును కూడా సీఎం ఖరారు చేశారు. అయితే ఎలక్షన్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున.. హైదరాబాద్‌కు రాగానే ఆయనకు ఏ కార్పొరే షన్‌ బాధ్యతలు అప్పగించాలనేది నిర్ణయించ నున్నట్లు తెలిపారు.

ఇక టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ గుండు సుధారాణిని.. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అధ్యక్షుడిగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకుడు, కరీంనగర్‌ జిల్లాకు చెందిన గెల్లు శ్రీనివాసయాదవ్‌ను నియమించారు. మొత్తంగా జూన్‌ 2వ తేదీన జరుగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ముందు పదవుల భర్తీ చేపట్టడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
 
చైర్మన్లుగా నియామకాలు ఇవీ..
► రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌: తూముకుంట నర్సారెడ్డి (గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే)
► విమెన్‌ కో– ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌: గుండు సుధారాణి (మాజీ ఎంపీ, వరంగల్‌ జిల్లా)
► హౌజింగ్‌ కార్పొరేషన్‌: మడుపు భూంరెడ్డి (మెదక్‌ జిల్లా)
► గిరిజన కో– ఆపరేటివ్‌ కార్పొరేషన్‌: గాంధీ నాయక్‌ (వరంగల్‌ జిల్లా)
► ఫిల్మ్, టీవీ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌: పుష్కర్‌ రామ్మోహన్‌రావు (ఆదిలాబాద్, మందమర్రి)
► వికలాంగుల అభివృద్ధి సంస్థ: కె.వాసుదేవరెడ్డి (కాకతీయ వర్సిటీ విద్యార్థి నాయకుడు)
► మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌: ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ (గోషామహల్‌ మాజీ ఎమ్మెల్యే)
► టెక్నికల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌: డాక్టర్‌ చిరుమిల్ల రాకేశ్‌కుమార్‌ (ఓయూ విద్యార్థి నాయకుడు, పెద్దపల్లి)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement