బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు
– బ్రాహ్మణ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు
కర్నూలు(అర్బన్): బ్రాహ్మణ విద్యార్థినీ, విద్యార్థులకు భారతీ పథకం ద్వారా ఉపకార వేతనాలు అందిస్తామని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. స్థానిక మౌర్యా ఇన్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరమైన ధవీకరణ పత్రాలతో అక్టోబర్ 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన వారు మతి చెందిన సందర్భాల్లో కర్మకాండ ఖర్చుల నిమిత్తం గరుడ పథకం కింద కార్పొరేషన్ ద్వారా రూ.10 వేలు అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను ఆదుకునేందుకు 2016–17లో కార్పొరేషన్‌కు రూ.65 కోట్లు కేటాయించారన్నారు. కర్నూలు నగరంలో 20 వేలకు పైగా బ్రాహ్మణులున్నారని, జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్ ఎన్నికల్లో తగు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నగరాధ్యక్షుడు కళ్లె చంద్రశేఖరశర్మ, కార్యదర్శి చెరువు దుర్గాప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి హెచ్‌కే రాజశేఖర్, కాల్వబుగ్గ అధ్యక్షుడు లక్ష్మినరసింహ శర్మ, సుబ్రమణ్యశాస్త్రి, కళ్లె రామకష్ణశర్మ, కల్కూర మురళీ తదితరులు పాల్గొన్నారు.