అడ్డ‘దారి’! | illiegel contractors in khammam corporation | Sakshi
Sakshi News home page

అడ్డ‘దారి’!

Published Fri, Nov 4 2016 2:45 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

అడ్డ‘దారి’! - Sakshi

అడ్డ‘దారి’!

అరుునోళ్లకు అప్పగించేందుకు ‘అధికార’ ఒత్తిడి
విషయం బయటకు పొక్కడంతో వివాదంగా మారిన వైనం
టెండర్ అమలుపై తర్జనభర్జన పడుతున్న పాలకవర్గం

అవినీతి అక్రమాలకు ఆస్కారం ఉండొద్దు.. అంతా పారదర్శకంగా జరగాలి.. చేసే పనులు నాణ్యతగా.. మన్నికగా ఉండాలి.. పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు కుమ్మక్కు కాకుండా.. ప్రభుత్వం ఈ-టెండర్ విధానం అమలు చేస్తోంది.. ఎన్ని నిబంధనలు పెట్టినా.. మా దారి మాదే.. రూల్స్ మాకేం పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు కాంట్రాక్టర్లు. నేతల ఒత్తిడికి తలొగ్గిన కార్పొరేషన్ అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. టెండర్‌పై నిర్ణయం తీసుకునేందుకు పాలకవర్గం తర్జన భర్జన పడుతోంది.  - ఖమ్మం

 ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్‌లో రూ.కోటిన్నర విలువైన రహదారి నిర్మాణ పనుల టెండరింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పనులు నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో.. కాంట్రాక్టర్లు కుమ్మక్కు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ-టెండర్ విధానం అమలు చేస్తోంది. అరుుతే అధికారాన్ని అడ్డం పెట్టుకున్న కొందరు కాంట్రాక్టర్లు ఈ నిబంధనలు మాకు వర్తించవు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టెండర్లు నిస్పక్షపాతంగా దాఖలైతే మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది.

పనులు కూడా నాణ్యతగా ఉండే అవకాశం ఉంది. అరుుతే టెండర్లు దక్కించుకునే విషయంలో ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.కోటిన్నర విలువైన రహదారి పనులు తమ వారికే ఇప్పించాలని ప్రజాప్రతినిధులు తలంచడం.. ఆపై ఎవరికి అనుమానం రాకుండా కేవలం రెండు టెండర్లు మాత్రమే దాఖలు చేయడం.. ఇది కాస్తా బయటకు పొక్కడంతో ఇప్పుడేం చేయాలనే దానిపై కార్పొరేషన్ పాలక మండలి తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో రూ.1.50కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులతో ఇటీవల టెండర్లు దాఖలు చేశారు. ఇవి సీఎం నగర అభివృద్ధి కోసం కేటారుుంచిన నిధులు కావడంతో ఓ ప్రజాప్రతినిధి అండతో స్థానిక ప్రజాప్రతినిధి బంధువు చక్రం తిప్పి టెండర్లు వేరే వాళ్లు దాఖలు చేయకుండా రెండు టెండర్లు మాత్రమే దాఖలయ్యేలా చేశారు. రూ.1.50కోట్ల పనులకు ఒక టెండర్ అధిక రుసుముకు జారీ చేసి.. మరో టెండర్‌ను కార్పొరేషన్ అధికారులు నిర్ణరుుంచిన ధరకే కోడ్ చేశారు. దీంతో జీరో పర్సంటేజీ వద్ద టెండర్ దక్కించుకునేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అరుుతే విషయం బయటకు పొక్కడం.. కొందరికి ఈ పనులపై సొమ్ములు రాకపోవడంతో టెండరింగ్ కాస్తా వివాదంగా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉండటంతో అటు అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 

 ఒత్తిడికి నిర్ణయం..
ఎలాగైనా పనులు దక్కించుకోవాలని తలంచిన సదరు కాంట్రాక్టర్ టెండర్‌ను ఖరారు చేరుుంచుకునేందుకు పాలక మండలిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మున్సిపాలిటీలో జరిగిన ఓ సమావేశంలో తనకు అనుకూలంగా ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో టెండర్ ఖరారు చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. సాధారణంగా సింగిల్ టెండర్ దాఖలు చేస్తే దానిని రద్దు చేసి.. అధికారులు తిరిగి టెండర్ దాఖలు చేయాల్సి ఉంది.

అరుుతే రెండు టెండర్లు మాత్రమే దాఖలు కావడం, అవి కూడా ఒకటి అధిక ధరకు, రెండోది నిర్దేశిత ధరకు దాఖలు కావడంతో ఏమి చేయాలో పాలుపోని అధికారులు.. దీనిని పాలక మండలి నిర్ణయానికే వదిలేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇతర కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేయకుండా చేసి, కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టే విధంగా వేసిన ఈ టెండర్లను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విపక్ష కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ టెండర్ రద్దవుతుందా? నేతల ఒత్తిడికి తలొగ్గి టెండర్ ఖరారు చేస్తారా? అనేది కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement