కబంధహస్తాల్లో కార్పొరేషన్!
శాతవాహన యూనివర్సిటీ : శానిటేషన్, కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు, డ్రెరుునేజీల నిర్మాణాలు.. ఇలా ఒకటేమిటి కార్పొరేషన్‌లోని ఏ పనికి టెండర్లు దక్కించుకోవాలన్న దానికి ఓ బడా కాంట్రాక్టర్ అండదండలు ఉండాల్సిందే. కాదు.. కూడదని టెండర్లు వేస్తే ఆయన, ఆయన అనుచరులు సదరు టెండరుదారుడి తాటా తీసేందుకైనా వెనకాడారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు అన్ని తానై నడిపించడం ఆయన నైజం.
టెండర్లు, నగదు పంపిణీల్లో ఏకఛత్రాధిపత్యం వహించడమే ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. కనుసైగలతో కరీంనగర్ కార్పొరేషన్‌లో చోటామోటా కాం ట్రాక్టర్లను అదుపు చేస్తూ, అదే స్థాయిలో కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వర ు ఆమ్యామ్యాలు అప్పజెబుతూ బల్దియాను సిండికేట్ హబ్‌గా మార్చాడు. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడాలేకుండా అన్ని పార్టీల నేతలను సంతృప్తిపరుస్తూ సిండికేట్ మాఫియాకు నాయకుడిగా చెలామణి అవుతున్నాడు.
కార్పొరేషన్‌లో ఏం జరుగుతోంది...
నగరంలోని 50 డివిజన్లలో శానిటేషన్‌తో వివిధ రకాల అభివృద్ధి పనులను చేయడానికి అర్హత గల కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు పిలిచి తక్కువ కొటేషన్ చేసిన వారికి ఇవ్వడం పరిపాటి. అరుు తే కరీంన గర్ బల్దియాలో అది మచ్చుకు కానరాదు. కాసులు, రాజకీయ అండదండలు అధికంగా ఉండి అధికారులను అనుకూలంగా మా ర్చుకున్న వారికి టెండర్లు దక్కడం ఆనవాయితీగా మారింది.
ఇలా జరిగిన పలు సంఘటనలకు చెక్ పెట్టే క్రమం లో బల్దియా అధికారులు టెండర్లను ఆన్‌లైన్ చేశారు. సిండికేట్ వ్యవహారంలో రాటుదేలిన సదరు కాంట్రాక్టర్ సాంకేతికతను సైతం హైజాక్ చేశాడు. ఏకంగా సంక్షే మం పేరిట ఓ సంఘాన్ని ఏర్పరచి సిండికేట్‌కు కొత్త నామకరణ చేసి మరీ టెండర్లను ఎప్పటిలాగే దక్కించుకునేందుకు పావులు కదిపినట్లు సమాచారం. దాదాపు పదేళ్లుగా సదరు కాంట్రాక్టరే పనులు చేసి దానిలో వచ్చే నగదును చోటామోటా కాంట్రాక్టర్లకు తలాకొంత ఇస్తూ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలిసింది.
టెండర్లు, నగదు పంపిణీలోనూ పైచేయి...
టెండర్లలో కోటి రూపాయలు పనులు జరిగితే దాదాపు 40 శాతం నిధులు మిగులుతాయని, దానిలో ఎవరికి ఎంతా ఇవ్వలన్నది బడా సిండికేట్ కాంట్రాక్టర్ చేతుల్లో ఉంటుందని కార్పొరేషన్‌లోని కాంట్రాక్టర్లే గుసగుసలాడుతున్నారు. బినామీ పనులు దక్కించకునేంతవరకు చోటా కాంట్రాక్టర్ల పని.. దానిలో వచ్చేది పోయేది అంతా సిండికేట్ నేత హవానే అన్న విమర్శలున్నాయి. అధిక మొత్తంలో వచ్చిన సొమ్ములో వచ్చిందే మహాభాగ్యమనే ధోరణిలో తీసుకోవడం మినహా ఎదిరించి నిలవాలంటే ఇక టెండర్లలో పాల్గొనాలనే ఆలోచనలు చేయకపోవడమే మంచిదనే మాటలు వినబడుతున్నాయి.
స్థానికేతరుల టెయిలెండర్లకు అర్హత లేదా...?
కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు టెండర్లు వేయడానికి నిబంధనల ప్రకారం స్థానిక, స్థానికేతర కాంట్రాక్టర్లందరూ అర్హులే. నిబంధనల మేరకు అన్ని అర్హత పత్రాలు సమర్పించి ఆన్‌లైన్ టెండర్లలో పాల్గొనవచ్చు. ఎవరు తక్కువకు టెండర్లు పాడితే వారికి కట్టబెడతారు.
అర్హతలు సరిగా లేని పక్షంలో సదరు టెండర్‌దారుని దరఖాస్తును తిరస్కరించే అధికారం అధికారులకు ఉంది. నిబంధనలు స్పష్టంగా ఉన్నా కొద్దిరోజుల క్రితం రవీందర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్, ఆయన అనుచరులు స్థానికేతరులనే సాకుతో కొందరు కాంట్రాక్టర్లు నగర పాలక సంస్థ ఆవరణలోనే భౌతిక దాడికి పాల్పడటం వివాదస్పదమైంది. దీనిపై అధికారులు కనీసం నోరువిప్పకపోవడం చర్చనీయాంశమైంది.
సంక్షేమం పేరిట సిండికేట్ దందా...?
కాంట్రాక్టర్ రవీందర్‌రెడ్డిపై దాడి వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే ఎంతటికైనా తెగిస్తామనే సంకేతాలు పంపేందుకే సదరు కాంట్రాక్టర్‌పై అందరూ చూస్తుండగానే నగరపాలక సంస్థ ఆవరణలోనే చెప్పులతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నగరంలోని కాంట్రాక్టర్ల సంక్షేమం కోసం అసోసియేషన్ అని ఒకవైపు చె బుతూ, అందులో డెరైక్టర్‌గా కొనసాగుతున్న వ్యక్తిపై దాడి చేయడాన్ని పరిశీలిస్తే.... ఎవరైన స్వతహాగా టెండర్లు వేస్తే సదరు కాంట్రాక్టర్స్ తాట తీస్తామనే హెచ్చరికలను పంపేందుకే ఈ దాడికి తెగబడినట్లు నగర పాలక సంస్థలోని అధికారులు, కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనతో సిండికేట్‌కు సహకరించకుంటే ప్రాణాలు హరీ అనే భావన కాంట్రాక్టర్లలో ఏర్పడింది. ఇంతజరుగుతున్నా మేయర్, అధికారులు కనీసం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
ఆధిపత్యపోరుతో అభివృద్ధికి మంగ ళం...
కార్పొరేషన్‌లో టెండర్లలో సిండికేట్ నాయకునిదే నడవాలన్న ఆధిపత్య పోరుతో పలు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నారుు. నగరంలో చేపట్టాల్సిన దాదాపు 60 పైగా పనులు నిల్చిపోగా, వీటికోసం కేటాయించిన రు.20 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక సమాచారం. ఇప్పటికే శానిటేషన్ పనులకు వాయిదాలుగా పొడిగింపులు ఇచ్చిన విషయం విదితమే. మిగితా పనుల టెండర్లపై కూడా ఆధిపత్యం చెలాయించే క్రమంలో పాలకవర్గంపై ఒత్తిడితెస్తూ వాటి ఆర్థిక బిడ్‌లు తెరవకుండా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
శానిటేషన్ టెండర్లతోపాటు ఓ కాంట్రాక్టర్ బినామీ పేర్లపై టెండర్లు వేశాడని, 13వ ఫైనాన్స్ పనుల్లో సైతం తిరిగి టెండర్లు వేసి తమకు ఇబ్బందులు పాలుచేస్తున్నాడనే కారణంతోనే నక్సలైట్ పేర బెదిరింపుల సాకుతో చితకబాదినట్లు సమాచారం. శానిటేషన్ టెండర్లలో బాధితుడు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై అతడికి అనుకూలంగా తీర్పువచ్చే అవకాశాలున్నట్లు తెలుసుకుని దాడికి పాల్పడినట్లు చర్చసాగుతోంది.