- ఆ సీటులో సమర్థులను కూర్చోబెట్టండి
- మేయర్‌కు షర్మిలారెడ్డి సూచన
చేతకాకుంటే రాజీనామా చేయండి
Published Thu, Feb 2 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
తాడితోట (రాజమహేంద్రవరం) :
నగరపాలక సంస్థను పాలించడం చేతకాకుంటే రాజీనామా చేసి సమర్థులను కూర్చోబెట్టాలని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మేయర్ పంతం రజనీ శేషసాయికి సూచించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మేయర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మేయర్‌కే ప్రొటోకాల్ లభించకపోతే తమవంటివారి సంగతేమిటని ప్రశ్నించారు. మహిళను కాబట్టే తనకు విలువ ఇవ్వడం లేదని మేయర్ అనడం భావ్యం కాదన్నారు. కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్ పిల్లి నిర్మలకుమారిని పోలీసులు ఈడ్చుకువెళ్లినప్పుడు మహిళా మేయర్ అయి ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ నెల 8న కౌన్సిల్ సమావేశానికి 9 అంశాలు సిద్ధం చేస్తే అధికారులు 13 అంశాలను తీసుకువచ్చినట్టు చెబుతున్నారని, మేయర్‌కు తెలియకుండా ఈ అంశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
పింఛన్ల మంజూరుపై తిరిగి సర్వే చేయాలి
నగరానికి 2 వేల పింఛన్లు వస్తే రూరల్ వార్డులకు మంజూరు చేయడమేమిటని షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మేయర్ ఏకమై పింఛన్లు మంజూరు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్ల మధ్య వ్యత్యాసం చూపించారని అన్నారు. ఎనిమిదో డివిజ¯ŒSలో 39 దరఖాస్తులు వస్తే 35 పింఛన్లు మంజూరు చేశారన్నారు. మురికివాడలైన 49వ డివిజ¯ŒSకు 102 దరఖాస్తులు వస్తే 32 మాత్రమే మంజూరు చేశారన్నారు. పింఛన్ల అవకతవకలపై తిరిగి సర్వే చేసి అర్హులైనవారికి మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
‘ఆదెమ్మదిబ్బ’పై ఆధారాలు బయటపెట్టాలి
ఆదెబ్బదిబ్బ స్థలానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ కార్పొరేష¯ŒS స్థలం ఉన్నా మేయర్ సహా ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎవరివద్ద ఆధారాలున్నాయో బయట పెట్టాలని లేకుంటే 15 రోజుల్లో తనవద్ద ఉన్న ఆధారాలను బయట పెడతానని స్పష్టం చేశారు. మాస్టర్‌ప్లా¯ŒS సహా ఏ అంశల పైనా తాను మేయర్‌తో కుమ్మక్కు కాలేదని, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రతి అంశంపైనా పోరాడుతున్నామని అన్నారు.
డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధరరావు మాట్లాడుతూ, ప్రొటోకాల్ ఇవ్వడం లేదని మేయర్ అంటున్నారని, కానీ వార్డుల్లో జరిగే కార్యక్రమాలకు రెండుసార్లు పిలిచినా హాజరు కాలేదని తెలిపారు. కార్పొరేటర్‌కు తెలియకుండానే ఆమె వార్డుల్లో పర్యటిస్తారని అన్నారు. స్థాయీ సంఘం చైర్మ¯ŒSగా అజెండా అంశాలు మేయర్‌కు తెలియాలని, తెలియదంటే అది వారి పాలన వైఫల్యమేనని అన్నారు. అసలు పాలక మండలి ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, వైఎస్సార్ సీపీ నాయకులు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement