sharmila reddy
-
వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటే దాడి.. ఏపీలో దాడులపై షర్మిలా రెడ్డి ఫైర్
-
ఆచంట నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం
-
మహిళలకు సీఎం వైస్ జగన్ పెద్దపీట వేశారు : మేడపాటి షర్మిలారెడ్డి
-
ప్రశ్నిస్తే.. ఫలితమిదా...
సాక్షి,తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: తమ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే ఊరుకునేది లేదంటూ అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపు పాలన రాజమహేంద్రవరంలో సాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరంలో అనధికారిక కట్టడాలు, ఆ కట్టడాల వెనుక జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతల వ్యాపారాలపై అధికారులతో దాడులు చేయిస్తూ నగరంలో మొదటిసారిగా సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఎలాంటి అనుమతుల లేకుండా ప్రసాదిత్య సంస్థ భారీ మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ నిర్మిస్తోంది. కనీస నిబంధనలు, రక్షణ చర్యలు చేపట్టకుండా దాదాపు 70 అడుగుల లోతు గోతులు రెండు ఎకరాల్లో తీశారు. ఫలితంగా దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్, రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు, తనిఖీలు చేసే అధికారులు ఇంత పెద్ద భారీ నిర్మాణం అనధికారికంగా సాగుతుంటే ఎలా మిన్నకుండిపోయారని, ఈ విషయంపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్‌రావు, చీఫ్‌విప్ మింది నాగేంద్ర, విప్ ఈతకోట బాపన సుధారాణి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం. పిల్లి నిర్మల, కురుమిల్లి అనురాధ పట్టుబట్టారు. ఈ పెద్ద వ్యవహారంలో నిజా నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కానీ చర్చకు అంగీకరించని అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది. రెచ్చగొట్టేలా పరుష పదజాలం ఉపయోగించింది. అయినా తమ పట్టువీడకుండా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చర్చకు డిమాండ్ చేయడంతో వారిలో కొంత మందిని సస్పెండ్ చేస్తూ మార్షల్స్‌తో బలవంతంగా బయటకు తొసేశారు. షర్మిలారెడ్డి రెస్టారెంట్‌పై దాడులు.. అనుమతులు లేకుండా నిర్మిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించిన మల్టిప్లెక్స్తోపాటు అనుమతులు లేకుండానే నిర్మాణం పూర్తి చేసుకుంటున్న కన్వెన్షన్ సెంటర్లపై చర్చకు వైఎస్సార్సీపీ నేతలు పట్టుబట్టిన నేపథ్యంలో అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగారు. రెండు నిర్మాణాలు అనధికారికంగా నిర్మించడం వల్ల నగరపాలక సంస్థకు పన్నులు, ఫీజులు రూపంలో దాదాపు రూ.20 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతోంది. ఈ రెండు నిర్మాణాల్లో ఎంపీ మురళీమోహన్‌కు వాటాలున్నాయని బలమైన ఆరోపణలున్నాయి. వీటిపై ప్రశ్నించిన ప్రతిపక్ష ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి వై జంక్షన్లో నిర్మిస్తున్న ‘ఈట్ అండ్ ప్లే’ రెస్టారెంట్‌కి అనుమతులు లేవంటూ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) అధికారులు దాడులు చేశారు. గుడా చీఫ్ ప్లానింగ్ అధికారి రామ్‌కుమార్, ఇతర సిబ్బంది గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రెస్టారెంట్‌కు వచ్చారు. నిర్మాణ అనుమతి పత్రాలు, ఇతర అంశాలపై అక్కడిక్కడే తనిఖీలు చేశారు. పత్రాలను పరిశీలించారు. అక్కడ నుంచే ఫోన్లు చేసి ఎవరితోనో మాట్లాడారు. విస్తుబోతున్న రాజమహేంద్రి... పాలనలో లోపాలపై ప్రశ్నించిన వారి వ్యాపారాలను దెబ్బతీసేలా దాడులు చేస్తామంటూ అధికార పార్టీ పెద్దల వ్యవహరిస్తున్న తీరు రాజమహేంద్రవరం నగర ప్రజలను విస్తుబోయేలా చేస్తోంది. రెస్టారెంట్‌పై దాడులు చేసే సమయంలో మేడపాటి షర్మిలారెడ్డి నగరంలో లేరు. కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత కుటుంబంతో కలసి దేవాలయాల సందర్శనకు వెళ్లారు. సంబంధిత యజమానులు లేని సమయంలో, అక్రమాలపై ప్రశ్నించిన గంటల వ్యవధిలోనే అధికారులు రెస్టారెంట్‌పై దాడులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా..’ అన్న చందంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తున్న సదరు నేతలు ఎన్నడూ లేనిది రాజమహేంద్రవరంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నగర ప్రజలు చర్చింకుంటున్నారు. -
ఆదిరెడ్డీ.. ఎమ్మెల్సీ మా భిక్షే
రాజమహేంద్రవరం సిటీ : ‘ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే మా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి భిక్షే. ఆ పదవిని అనుభవిస్తూ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తూ మహిళలను దూషిస్తూ, చులకన చేసి మాట్లాడుతున్నారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ బడ్జెట్ అంకెల గారడీ. అభివృద్ధిని ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు’అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంకెల గారడీగా ఉన్న నగర పాలకసంస్థ బడ్జెట్‌కు మేయర్ రజనీశేషసాయి.. సభ్యులతో మమ అనిపించారన్నారు. ప్రారంభ, ముగింపు నిల్వల్లో కనీసం ఐదు శాతం నిధులు లేకుండానే బడ్జెట్ తయారైందని, తొమ్మిది రూపాయల లోటు చూపించారన్నారు. గతేడాది బడ్జెట్ కన్నా ఈ ఏడాది పెరగాల్సిన ఆదాయం చూపలేదన్నారు. ప్రజలపై పన్నుల భారం పెంచిన తరువాత కూడా ఆదాయం కనిపించలేదాని ఆమె ప్రశ్నించారు. నిధులు తెచ్చుకోవడంలో జీరో అయ్యారు మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కార్పొరేషన్‌కు నిధులు తెచ్చుకోవడంలో జీరోలు అయిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. సంస్థకు వచ్చే గ్రాంటులు రూ.13.22 కోట్లు మాటేమిటన్నారు. నగరాభివృద్ధికి తీసుకురావాల్సిన నిధుల విషయంలో అధికార పార్టీ డీలా పడిందన్నారు. మేయర్‌కు ఎందుకీ పక్షపాతం? బడ్జెట్ సమావేశం సమయంలో పింఛన్ల విషయం మాట్లాడవద్దని మేయర్ అన్నారని, వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న డివిజన్ల్లో పేదలకు పింఛన్లు అందక అవస్ధలు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. తన డివిజన్లో 95 పింఛన్లు దరఖాస్తుల్లో 25 మంజూరు కాలేదన్నారు. నగరంలోని 50 డివిజన్ల్లో చాలామంది పేదలున్నారని, ఒక్క మేయర్ డివిజన్‌లోనే లేరన్నారు. పుష్కర నిధులు ఏమయ్యాయి? నగరానికి పుష్కరాల్లో రూ.240 కోట్లు మంజూరైతే రూ.120 కోట్లు మాత్రమే వచ్చాయని మిగిలిన నిధులు ఏమయ్యాయోనని, రావాల్సిన నిధులపై కౌన్సిల్లో ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. నిధుల విషయంలో టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే కార్పొరేషన్‌కు రాసిన లేఖకు సమాధానం రావాల్సి ఉందన్నారు. పుష్కర నిధులపై ప్రశ్నిస్తే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మహిళలను దూషిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆ రూ.120 కోట్లలో రూ.60 కోట్లు మాత్రమే ఇంజనీరింగ్ అధికారులు ఖర్చు చేశారని ఆమె తెలిపారు. సన్ ఆఫ్ ఎమ్మెల్సీ.. కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు సన్ ఆఫ్ ఎమ్మెల్సీ మాదిరిగా అధికారిక కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని 4వ డివిజన్ కార్పొరేటర్, నగర ఇంజినీరింగ్ కమిటీ చైర్మన్ బొంతా శ్రీహరి విమర్శించారు. దీనిపై అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. టీడీపీ సొంత రాజ్యాంగం రాసుకుని పాలన చేస్తోందని, ఫ్లోర్ లీడర్ వర్రే బయటకు పొండని అంటున్నారని, ఇక చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పార్టీ అధినేత పాదయాత్రను వర్రే శ్రీనివాస్ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు, కొమ్ము జిగ్లర్, ఆనంద్, శ్యాంబాబు, బాలకృష్ణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుదగ్గర మార్కుల కోసమే.. సీఎం చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేందుకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మహిళలను చులకనగా.. ఏకవచనంతో మాట్లాడారని ఆమె ఆరోపించారు. గతంలో మాతో పాటు అవినీతిపై పోరాటం చేసిన ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడడం దారుణమన్నారు. -
ఏయ్..నీకేం తెల్దు..కూచో
రాజమహేంద్రవరం సిటీ : నగరాభివృద్ధికి బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో అభివృద్ధిపై ప్రశ్నించే మహిళలు, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణిలపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఏకవచన సంబోధన చేస్తూ ఏయ్ నువ్వు ఆగు.. నువ్వు కూర్చో అంటూ రెచ్చిపోయారు. నువ్వంటే నువ్వంటూ ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధిపై ఎప్పటిలోగా చర్చ పెట్టాలి? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ముందే చర్చించవచ్చు కదా అని మేయర్, కమిషనర్లను ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి నేతృత్వంలో ప్రశ్నించగా ఆదిరెడ్డి ఎమ్మెల్సీ నన్న విషయం మర్చిపోయి రెచ్చిపోయారు. ప్రశ్నిస్తున్నది ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ అనే మర్యాద లేకుండా ఏయ్ కూర్చో అంటూ ఆదిరెడ్డి చేసిన ఏకవచన సంబోధనకు సభలోని మహిళలు, ప్రజా ప్రతినిధులు విస్తుపోయారు. ‘జన్మభూమి’లో పేదలకు పింఛన్లు ఇచ్చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికి ఇవ్వకపోవడంపై క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నామంటూ, పుష్కరాలకు మంజూరైన నిధులు రూ.240 కోట్లకు రూ.130 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని మిగిలిన వాటి పరిస్థితి ఏమిటంటూ షర్మిలారెడ్డి మేయర్ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి కార్పొరేషన్ తరుఫున వకాల్తా పుచ్చుకుని నీకేం తెలుసు ప్రభుత్వం దఫదఫాలుగా ఇస్తుంది.. నువ్వు కూర్చో.. లేకపోతే బాగోదంటూ రెచ్చిపోయారు. అయినప్పటికీ అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలంటూ షర్మిలారెడ్డి పట్టుపట్టారు. సభలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అభివృద్ధి పనుల విషయాన్ని సభ దృష్టికి తీసుకుని రావాల్సిన ఆదిరెడ్డి తీరుకు సభికులు విస్తుపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్లకే మాట్లాడే అవకాశం 2017–18 సంవత్సరం బడ్జెట్ సవరణ, 2018–19 సంవత్సరానికి అంచనా బడ్జెట్ మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన చదివి వినిపించారు. దానిపై చర్చించి చర్యలు చేపట్టాల్సి ఉండగా కేవలం ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాట్లాడడం వరకే అవకాశం కల్పించారు. మిగిలిన సభ్యులు బడ్జెట్‌పై చర్చించే ప్రయత్నం చేసినా వారికి అవకాశం ఇవ్వకుండానే బడ్జెట్‌ను ఆమోదించామని మేయర్ సమావేశం ముగించారు. 2018–19 సంవత్సరానికి రూ.76 కోట్ల 41 లక్షల 50 వేలతో ప్రారంభ నిల్వతో అంచనాలు ప్రారంభించి రూ.299.05 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు కేటా యిస్తూ బడ్జెట్‌ను సిద్ధం చేశారు. రూ.222 కోట్ల 64 లక్షల 25 వేల ఆదాయంగా రూ.285 కోట్ల 70 లక్షల ఖర్చులుగా తయారు చేశారు. ముగింపు నిల్వగా రూ.133కోట్ల 5 లక్షల 75 వేలుగా చూపించారు. 2017–18 సంవత్సరానికి రూ.321 కోట్ల 2 లక్షల 32 వేల ప్రారంభ నిల్వతో బడ్జెట్ తయారు చేయగా ఆదాయం రూ.213 కోట్ల 64 లక్షల 85 వేలు, ఖర్చులు రూ.244 కోట్ల 60 లక్షల 82 వేలుగా ఖర్చులుగా నివేదిక సిద్ధం చేశారు. -
షర్మిల కొడుకు కిడ్నాప్.. ఎవరి పని?
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి కుమారుడి కిడ్నాప్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఘటన జరిగిన తీరును బట్టి అది వారికి బాగా తెలిసిన వ్యక్తులు చేసినట్లుగా స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి బాలుడితో సహా కారును దుండగుడు ఎత్తుకెళ్లగా కారు వేగం తగ్గిన సమయంలో బాలుడు దూకేసిన విషయం తెలిసిందే. అయితే తెల్లవారు జామున వాహనాన్ని అగంతకుడు గోకవరంలో వదిలాడు. కారు ఉన్న ప్రదేశాన్ని వివరిస్తూ రాసిన లేఖను గురువారం ఉదయం ఆరు గంటలకు షర్మిలా రెడ్డి నివాసం వద్ద వదలడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షర్మిలా రెడ్డి ఏవీ అప్పారావు రోడ్డులోని తన రెస్టారెంట్ నుంచి తన కుమారుడితో నూతన ఇన్నోవా వాహనంలో ఇంటికి వచ్చారు. కుమారుడిని కారులోనే ఉంచిన ఆమె తన కుమార్తెను తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లారు. వెంటనే అగంతకుడు బాలుడితో సహా కారును ఎత్తుకెళ్లాడు. నగరంలోని ఎపెక్స్ ఆస్పత్రి వద్ద వాహన వేగం తగ్గడంతో బాలుడు కిందకు దూకేశాడు. నగదు కోసం బాలుడుని కిడ్నాప్ చేయాలనుకుంటే అగంతకుడు పక్కా ప్రణాళికతో వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని స్పృహతప్పే విధంగా చేయడం, బాలుడు కిందకు దూకేస్తుంటే అడ్డుకోకపోవడం, కారు డోర్లు లాక్ చేసే అవకాశం ఉన్నా చేయకపోవడం వల్ల అగంతకుడు బాలుడుని కిడ్నాప్ చేయడానికి వచ్చినట్లుగా లేదని ఘటన జరిగిన తీరు తెలుపుతోంది. నిన్ను ఏం చేయనంటూ నిందితుడు బాలుడితో చెప్పడం, కారులో నుంచి దూకుతుంటే అడ్డుకోకపోవడం అతను బాలుడిని కిడ్నాప్ చేయడానికి వచ్చినట్లుగా లేదని పోలీసులు అంచనాకు వస్తున్నారు. కిడ్నాప్ చేయాలనుకుంటే అగంతకుడు ఒక్కడే రాడని పలువురు బృందంగా వచ్చేవారని భావిస్తున్నారు. కావాలనే చేశారా...? తెల్లవారితే దీపావళి పండుగ నేపథ్యంలో రాజకీయ నేత అయిన షర్మిలా రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిపారా అన్న అనుమానాలకు ఘటన జరిగిన తీరు, అనంతరం పరిణామాలు బలపరుస్తున్నాయి. షర్మిలా రెడ్డి కుటుంబం అంటే పడని బంధువులు, లేదా రాజకీయ ప్రత్యర్థులు ఈ పని చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పండగ రోజున ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించాలన్న ఉద్దేశంతోనే తెలిసిన వారు ఈ పని చేశారని నగరంలో చర్చ జరుగుతోంది. ఘటన జరిగినప్పటి నుంచి షర్మిలారెడ్డి కుటుంబం ఇంకా కోలుకోలేకపోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేత కుటుంబానికి ఇలా జరగడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అగంతకుడి కోసం ముమ్మర గాలింపు... అగంతకుడి కోసం ఒకటో పట్టణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీఐ రవీంద్ర పర్యవేక్షణలో ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలిస్తున్నాయి. అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి ఈ కేసును సవాల్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామని సీఐ రవీంద్ర చెప్పారు. కారు వదిలి.. లేఖ రాసి... బాలుడు దూకేసిన తర్వాత కారుతో వెళ్లిపోయిన అగంతకుడు వాహనాన్ని గోకవరం సమీపంలో వదిలాడు. ఆ విషయాన్ని గురువారం తెల్లవారు జామున ఆరు గంటలకు ఓ లేఖలో వివరిస్తూ దానవాయిపేటలోని షర్మిలారెడ్డి ఇంటి ముందు వదిలాడు. బుధవారం రాత్రి ఘనట జరిగిన తర్వాత తెల్లవారు జాము 3 గంటల వరకు ఆమె ఇంటి వద్ద పలువురు రాజకీయ నేతలు, నగర ప్రముఖులు ఉన్నారు. పోలీసులు 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు. అయినా ఆరు గంటలకు అగంతకుడు అక్కడ లేఖను వదలడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి తెలిసిన వారు అక్కడే ఎవరో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే జన సంచారం లేని సమయం చూసి ఖచ్చితంగా అదే సమయానికి అక్కడికి ఎలా వస్తాడన్నది ప్రశ్నగా మారింది. లేఖను అక్కడ అగంతకుడు వదిలాడా? లేక అతనికి సంబంధించిన వారు వదిలారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే కొనుగోలు చేసిన రూ.18 లక్షల విలువైన తెలుపురంగు ఇన్నోవా కారును తీసుకెళ్లి మళ్లీ గంటల వ్యవ్యధిలో నగరం బయట వదిలి ఆ సమాచారం చేరవేయడంతో అతను దొంగ కాదని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని వదిలివేయడంతో అతను కిడ్నాపర్ కాదని, రూ.18 లక్షల విలువైన కారును తిరిగి వారికి అప్పగించేలా లేఖలో సమాచారం ఇవ్వడంతో దొంగ కాదన్న విషయం స్పష్టమవుతోంది. -
నగర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు
బడ్జెట్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు ఎలా వస్తాయి? పాలకమండలిపై ధ్వజమెత్తిన ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగర అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ పాలక మండలికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వస్తున్నట్టు ప్రకటించడం సరికాదన్నారు. బడ్జెట్ సమావేశం వాయిదా పడిన తర్వాత పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్‌రావు, కార్పొరేటర్లు పిల్లి నిర్మల, బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, బొంతా శ్రీహరిలతో కలసి శుక్రవారం ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. పురపాలక పరిపాలన చట్టం ప్రకారం మార్చి 31 నాటికి బడ్జెట్‌ను ఆమోదించి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని షర్మిలారెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా బడ్జెట్ ఆమోదించకపోవడం పాలకమండలి, మేయర్, అధికార యత్రాంగం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కనీసం 50 రోజుల ముందుగానే బడ్జెట్ పుస్తకాలను కార్పొరేటర్లందరికీ పంపిణీ చేయాలి. కానీ కేవలం ఐదు రోజుల ముందు, అదీ ప్రతిపక్ష కార్పొరేటర్లు విలేకర్ల సమావేశం పెట్టి అడిగితే ఇచ్చారు అని షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. సకాలంలో బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి మూడేళ్లుగా నిధులు రావడం లేదని ఆమె ఆరోపించారు. కార్ల కొనుగోలుకు రూ. 45 లక్షలా? మేయర్, కమిషనర్లకు నూతన వాహనాల కోసం రూ. 45 లక్షలు కేటాయించాడంపై మేడపాటి ధ్వజమెత్తారు. మాస్టర్‌ప్లా¯ŒS ఆమోదించిన తర్వాత దానిపై త్రీడీ ప్రజెంటేష¯ŒS కోసం రూ. 35 లక్షలు కేటాయించాలని ప్రతిపాదించడం విడ్డూరంగా ఉందన్నారు. పుష్కరాల నిధులు ఇంకా రూ. 120 కోట్లు రావాల్సి ఉందని, కానీ రూ. 40 కోట్లకే ప్రతిపాదనలు పెట్టడం వెనక రహస్యమేమిటని ఆమె ప్రశ్నించారు. 12వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా ఖర్చు కాలేదా? మేయర్, కమిషనర్ వాహనాల కోసం కేటాయించిన రూ. 45 లక్షలు 12వ ఆర్థిక సంఘం నిధులని, ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం అమలులో ఉందని డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12వ ఆర్థిక సంఘం నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు మేడపాటి అనిల్‌రెడ్డి, మజ్జి అప్పారావు, కోడికోట తదితరులు పాల్గొన్నారు. -
చేతకాకుంటే రాజీనామా చేయండి
ఆ సీటులో సమర్థులను కూర్చోబెట్టండి మేయర్‌కు షర్మిలారెడ్డి సూచన తాడితోట (రాజమహేంద్రవరం) : నగరపాలక సంస్థను పాలించడం చేతకాకుంటే రాజీనామా చేసి సమర్థులను కూర్చోబెట్టాలని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మేయర్ పంతం రజనీ శేషసాయికి సూచించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మేయర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మేయర్‌కే ప్రొటోకాల్ లభించకపోతే తమవంటివారి సంగతేమిటని ప్రశ్నించారు. మహిళను కాబట్టే తనకు విలువ ఇవ్వడం లేదని మేయర్ అనడం భావ్యం కాదన్నారు. కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్ పిల్లి నిర్మలకుమారిని పోలీసులు ఈడ్చుకువెళ్లినప్పుడు మహిళా మేయర్ అయి ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ నెల 8న కౌన్సిల్ సమావేశానికి 9 అంశాలు సిద్ధం చేస్తే అధికారులు 13 అంశాలను తీసుకువచ్చినట్టు చెబుతున్నారని, మేయర్‌కు తెలియకుండా ఈ అంశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పింఛన్ల మంజూరుపై తిరిగి సర్వే చేయాలి నగరానికి 2 వేల పింఛన్లు వస్తే రూరల్ వార్డులకు మంజూరు చేయడమేమిటని షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మేయర్ ఏకమై పింఛన్లు మంజూరు చేశారన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్ల మధ్య వ్యత్యాసం చూపించారని అన్నారు. ఎనిమిదో డివిజ¯ŒSలో 39 దరఖాస్తులు వస్తే 35 పింఛన్లు మంజూరు చేశారన్నారు. మురికివాడలైన 49వ డివిజ¯ŒSకు 102 దరఖాస్తులు వస్తే 32 మాత్రమే మంజూరు చేశారన్నారు. పింఛన్ల అవకతవకలపై తిరిగి సర్వే చేసి అర్హులైనవారికి మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ‘ఆదెమ్మదిబ్బ’పై ఆధారాలు బయటపెట్టాలి ఆదెబ్బదిబ్బ స్థలానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ కార్పొరేష¯ŒS స్థలం ఉన్నా మేయర్ సహా ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎవరివద్ద ఆధారాలున్నాయో బయట పెట్టాలని లేకుంటే 15 రోజుల్లో తనవద్ద ఉన్న ఆధారాలను బయట పెడతానని స్పష్టం చేశారు. మాస్టర్‌ప్లా¯ŒS సహా ఏ అంశల పైనా తాను మేయర్‌తో కుమ్మక్కు కాలేదని, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రతి అంశంపైనా పోరాడుతున్నామని అన్నారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధరరావు మాట్లాడుతూ, ప్రొటోకాల్ ఇవ్వడం లేదని మేయర్ అంటున్నారని, కానీ వార్డుల్లో జరిగే కార్యక్రమాలకు రెండుసార్లు పిలిచినా హాజరు కాలేదని తెలిపారు. కార్పొరేటర్‌కు తెలియకుండానే ఆమె వార్డుల్లో పర్యటిస్తారని అన్నారు. స్థాయీ సంఘం చైర్మ¯ŒSగా అజెండా అంశాలు మేయర్‌కు తెలియాలని, తెలియదంటే అది వారి పాలన వైఫల్యమేనని అన్నారు. అసలు పాలక మండలి ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, వైఎస్సార్ సీపీ నాయకులు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
నాపై దుష్ర్పచారం చేస్తున్న దుండగులను వదలొద్దు
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు షర్మిల ఫిర్యాదు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ర్పచారం నన్ను గాయపర్చింది నేనెప్పుడూ కలవని, మాట్లాడని, కనీసం చూడని వ్యక్తితో ముడిపెడితూ వదంతులు సృష్టిస్తున్నారు ఒక్క ఆధారం కూడా లేకుండా పిరికిపందలు నాపై రాతలు రాస్తున్నారు నా సచ్ఛీలతకు భగవంతుడే సాక్షి గుండె లోతుల్లో గూడు కట్టుకున్న అంతులేని క్షోభతో, బాధాతప్తమైన హృదయంతో ఈ ఫిర్యాదు చేస్తున్నాను హైదరాబాద్: సోషల్ నెట్వర్క్ సైట్లలో, పలు వెబ్సైట్లలో తనపై హీనాతిహీనమైన రీతిలో సాగుతున్న దుష్ర్పచారాన్ని తక్షణం అరికట్టాలని, అలా చేస్తున్న పిరికిపందలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏసీ సభ్యుడు డీఏ సోమయాజులు శనివారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలసి అందజేశారు. తాను చేస్తున్న ఈ ఫిర్యాదు కేవలం తన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమే కాదని, తాను రాస్తున్నది.. సమాజంలోని ప్రతి తల్లి, ప్రతి భార్య, ప్రతి బిడ్డ గౌరవానికి సంబంధించిందని ఫిర్యాదులో షర్మిల పేర్కొన్నారు. ఎవరో అకారణంగా మోపుతున్న అభాండాలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం అనేది ఏ మహిళకైనా దుర్భరమైన విషయమని, చాలా మందిలాగే తనను కూడా కొందరు లక్ష్యంగా(టార్గెట్) చేసుకుని దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల విషయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే స్థాయికి నేటి రాజకీయాలు పడిపోయాయన్నారు. ‘సినీ నటుడు ప్రభాస్‌కు ముడిపెడుతూ ఇంటర్నెట్లో వదంతులు ప్రచారం అవుతున్నాయి. నేనింత వరకూ ప్రభాస్‌ను కలవలేదు, మాట్లాడలేదు, కనీసం చూడనైనా లేదు... నా గౌరవ మర్యాదలు దెబ్బతీసే దుర్మార్గమైన లక్ష్యంతో అత్యంత క్రూరమైన రీతిలో ఈ దుష్ర్పచారం చేస్తున్నారు. ఇక్కడ నేనొక వాస్తవాన్ని స్పష్టం చేయదల్చుకున్నాను. వందలాది వెబ్సైట్లలో కొనసాగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారంటే ఈ వదంతులు నిరాధారమైనవని వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు’ అని షర్మిల పేర్కొన్నారు. షర్మిల చేసిన ఫిర్యాదులో ముఖ్యాంశాలివీ.. ఈ ఫిర్యాదుతో మరింత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని తెలుసు.. న్యాయం కోసం తానిపుడు చేసే పోరాటం ఒక పెద్ద అంశంగా మారుతుందని తెలుసుననీ, తనకు సరైన న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదని షర్మిల పేర్కొన్నారు. కుసంస్కారులు, నేలబారు వ్యక్తుల అనైతిక కుట్రకు తాను అనవసర ప్రాధాన్యతనిస్తున్నాననే విషయం కూడా తనకు తెలుసుననీ, ఈ విషయంలో తాను పోరాటానికి దిగిన వెంటనే దీని నుంచి కూడా వినోదం పొందాలనుకునే వారు తమపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని కూడా తెలుసునని ఆమె అన్నారు. ‘అయినప్పటికీ ఇలాంటి అవరోధాలకు ఎదురొడ్డి నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని వైరల్ గ్రోత్తో మరింతగా వ్యాప్తి చేస్తారన్న భయంతో ఇలాంటి పిరికిపందలను వదిలేసి తలదించుకుని మౌనంగా ఉండిపోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ విష ప్రచారాన్ని ఖండించకుండా ఉంటే ఈ వదంతులే నిజమనుకునే ప్రమాదం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యాలు నెరవేరాలని నేను నిజాయితీగా మనస్ఫూర్తిగా కోరుకున్నా...అందుకే మా అన్న తరఫున పోరాడా. ఈ విషయంలో ఎవరైనా నాతో విభేదించాలనుకుంటే నా కళ్లలోకి చూస్తూ నా నమ్మకాలను సవాలు చేసి ఉంటే వారి ప్రయత్నాన్ని నేను గౌరవించే దాన్ని, కానీ ఇలా దొంగదెబ్బ తీసేందుకు చేసే కుట్రలను మాత్రం నేను క్షమించలేను’ అని షర్మిల ఘాటుగా స్పందించారు. నేను తప్పుచేయకపోయినా.. ‘‘ఒక భారతీయ మహిళగా నేను విలువలు కలిగిన భార్యను, గౌరవ మర్యాదలు కలిగిన తల్లిని, సంస్కారం నిండిన చెల్లిని, బిడ్డని, నా సచ్ఛీలతకు ఆ భగవంతుడే సాక్షి. నా గౌరవమర్యాదలను దెబ్బ తీసే ప్రయత్నాలను చూసి నేను బాగా క్షోభ చెందాను. నేనే తప్పు చేయకపోయినా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బోనెక్కాల్సి రావడం బాధిస్తోంది. మర్యాదగల ఇతర మహిళల మాదిరిగానే నేను గుండె లోతుల్లోంచి బాధతో కుమిలిపోతున్నాను. ఇది కేవలం నా ఒక్కదాని సమస్యే కాదు, ప్రతి మహిళ ప్రతిష్టకూ సంబంధించింది. అందుకే మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవద్దు’’ అని పోలీసులకు షర్మిల విజ్ఞప్తి చేశారు. నిజమా కాదా అని కనీసం ఆలోచించలేదు.. ఈ రోజు వరకూ నిరాధారమైన తప్పుడు కూతలను వివిధ పోర్టల్స్, వెబ్సైట్లు, డొమైన్లలో బాధ్యతా రాహిత్యంగా ప్రదర్శనకు పెట్టిన వారు, అసలు వీటిలో నిజం ఉందా అని ఆలోచించనే లేదని షర్మిల పేర్కొన్నారు. ఈ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేసిన దుర్మార్గులు వేర్వేరు పోర్టళ్లు, వెబ్సైట్లు, సోషన్ నెట్వర్కింగ్ మీడియాను ఈ తప్పుడు ఆరోపణల వ్యాప్తికి వినియోగిస్తున్నారన్నారు. ఈ విషప్రచారానికి సంబంధించి కొన్ని సైట్లు, లింకులపై వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మే 1వ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదును సమర్పిస్తే కేసు దర్యాప్తును ప్రారంభించారని, ఓ పక్క దర్యాప్తు జరుగుతూ ఉండగానే తాజాగా మరికొందరు వ్యక్తులు నీతిబాహ్యమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తూనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆయా వెబ్సైట్లు, డొమైన్ల ఇన్‌చార్జీలతో ఈ వ్యక్తులు కుమ్మక్కు కావడంతోనే ఆగుకుండా ఈ ప్రచారం సాగుతోందన్నారు. కఠినంగా శిక్షించండి..: ఈ నీతిబాహ్యమైన వ్యవహారం తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసిందని, ఇలాంటి దుష్ర్పచారంలో సూత్రధారులు, పాత్రధారులు అయిన ప్రతి ఒక్కరిపైనా ఐపీసీలోని 509, 499, 500, 501 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని షర్మిల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్న సంస్థలను ప్రోత్సహిస్తూ వారికి వేదికగా నిలుస్తున్న సఫారీ, గూగుల్ సెర్చ్ ఇంజిన్లపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని, తనపేరు టైప్ చేయగానే ఈ ఇంజిన్లు ఈ విషప్రచారాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తున్నాయన్నారు. తనపై నీతిబాహ్యమైన ప్రచారాన్ని ఆపాల్సిందిగా వివిధ సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా పోర్టల్స్‌కు ఆదేశాలు జారీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
ఓటు అడిగే హక్కు మాకే ఉంది
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రిలో ఓటు అడిగే హక్కు ఇద్దరికే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి మేయర్ అభ్యర్థి షర్మిలారెడ్డి అంటున్నారు. ప్రజలు మెచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానేత రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరు కాగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిన మేడపాటి సీతారామరెడ్డి వారసురాలిగా తనకు ఉన్నాయంటున్నారు విద్యావంతురాలిగా, యువతరానికి ప్రతినిధిగా తాను రాజమండ్రిని గ్రేటర్ సిటీగా అబివృద్ధి చేస్తానంటున్న షర్మిల వివరాలు... విద్య : భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజ నీరింగ్ కళాశాల నుంచి బీటెక్. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ. గ్రూప్-1 ప్రిలిమ్స్ పాసై, మెయిన్స్‌కు అర్హత సాధించారు. కుటుంబ నేపథ్యం : భర్త: నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ప్రముఖ కాంట్రాక్టర్ మేడపాటి సీతారామ రెడ్డి సీతారామరెడ్డి కుమారుడు మేడపాటి అనిల్ కుమార రెడ్డి. బీఈ పూర్తిచేశారు. ప్రముఖ వ్యాపార వేత్త. నగరంలో ఈట్ అండ్ ప్లే అనే రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లలు. పాప, బాబు. వ్యక్తిత్వం : చిరునవ్వుతో అందరినీ పలకరించడం, ఏదైనా సరే సాధించాలని పట్టుదల. తన కష్టాన్ని నమ్ముకుని విజయం సాధించాలన్న లక్ష్యం అభిలాష : యువత ఉన్నత విద్యావంతులు కావాలి. వారి పరిజ్ఞానం సామాజిక సేవకు అంకితం కావాలి. రాజమండ్రిలో తాగు నీటి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో స్వచ్ఛమైన నీరు అందించాలి. మురుగు నీటి వ్యవస్థను సమూలంగా సంస్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలి. సీతారామ రెడ్డి సేవా కార్యక్రమాలు : సీతారామరెడ్డి అసాధారణ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ప్రభుత్వం నుంచి 1998-99లో భారతజ్యోతి అవార్డు అందుకున్నారు. ప్రజోపయోగార్థం కోటిలిగాల రేవులో రోటరీ కైలాస భూమి నిర్మించారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఆడిటోరియం నిర్మించారు. కంబాలచెరువు వద్ద హైటెక్ బస్టాండ్ నిర్మించారు. ఏకేసీ కళాశాల, షాడే బాలికల పాఠశాల, అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలోలో ప్రధాన భవనాలు నిర్మించి ఇచ్చారు. శబరిమలైలో కాటేజీలు, ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.