సాక్షి, రాజమండ్రి :
రాజమండ్రిలో ఓటు అడిగే హక్కు ఇద్దరికే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి మేయర్ అభ్యర్థి షర్మిలారెడ్డి అంటున్నారు.
ప్రజలు మెచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానేత రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకరు కాగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిన మేడపాటి సీతారామరెడ్డి వారసురాలిగా తనకు ఉన్నాయంటున్నారు విద్యావంతురాలిగా, యువతరానికి ప్రతినిధిగా తాను రాజమండ్రిని గ్రేటర్ సిటీగా అబివృద్ధి చేస్తానంటున్న షర్మిల వివరాలు...
విద్య : భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజ నీరింగ్ కళాశాల నుంచి బీటెక్. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ. గ్రూప్-1 ప్రిలిమ్స్ పాసై, మెయిన్స్‌కు అర్హత సాధించారు.
కుటుంబ నేపథ్యం :
భర్త: నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ప్రముఖ కాంట్రాక్టర్ మేడపాటి సీతారామ రెడ్డి సీతారామరెడ్డి కుమారుడు మేడపాటి అనిల్ కుమార రెడ్డి. బీఈ పూర్తిచేశారు. ప్రముఖ వ్యాపార వేత్త. నగరంలో ఈట్ అండ్ ప్లే అనే రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లలు. పాప, బాబు.
వ్యక్తిత్వం : చిరునవ్వుతో అందరినీ పలకరించడం, ఏదైనా సరే సాధించాలని పట్టుదల. తన కష్టాన్ని నమ్ముకుని విజయం సాధించాలన్న లక్ష్యం
అభిలాష : యువత ఉన్నత విద్యావంతులు కావాలి. వారి పరిజ్ఞానం సామాజిక సేవకు అంకితం కావాలి.
రాజమండ్రిలో తాగు నీటి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో స్వచ్ఛమైన నీరు అందించాలి. మురుగు నీటి వ్యవస్థను సమూలంగా సంస్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలి.
సీతారామ రెడ్డి సేవా కార్యక్రమాలు :
సీతారామరెడ్డి అసాధారణ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ప్రభుత్వం నుంచి 1998-99లో భారతజ్యోతి అవార్డు అందుకున్నారు.
ప్రజోపయోగార్థం కోటిలిగాల రేవులో రోటరీ కైలాస భూమి నిర్మించారు.
టీటీడీ కళ్యాణ మండపంలో ఆడిటోరియం నిర్మించారు.
కంబాలచెరువు వద్ద హైటెక్ బస్టాండ్ నిర్మించారు.
ఏకేసీ కళాశాల, షాడే బాలికల పాఠశాల, అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలోలో ప్రధాన భవనాలు నిర్మించి ఇచ్చారు.
శబరిమలైలో కాటేజీలు, ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.
ఓటు అడిగే హక్కు మాకే ఉంది
Published Fri, Mar 21 2014 1:09 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM
Advertisement
Advertisement