కాకినాడ కార్పొరేషన్‌కు ‘స్కాచ్‌’ గుర్తింపు | kakinada corporation | Sakshi
Sakshi News home page

కాకినాడ కార్పొరేషన్‌కు ‘స్కాచ్‌’ గుర్తింపు

Published Wed, Sep 21 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

kakinada corporation

కాకినాడ : 
కాకినాడ నగరపాలక సంస్థకు ముంబాయికి చెందిన స్కాట్‌ గ్రూప్‌ సంస్థ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలో అమలు జరుగుతున్న 100 ప్రాజెక్టులను ప్రాతిపదికగా తీసుకొని ఒక్కో అంశంపై ఒక్కో ప్రాంతానికి స్కాచ్‌సంస్థ ప్రత్యేక గుర్తింపునిస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణంలో కాకినాడ నగరపాలక సంస్థను ఎంపిక చేశారు. ఈ మేరకు స్కాచ్‌ గ్రూఫ్‌ చైర్మన్‌ సమీర్‌ కొచార్‌ నుంచి కార్పొరేషన్‌కు మంగళవారం సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ కార్పొరేషన్‌కు మాత్రమే ఆ గుర్తింపు లభించింది. గడచిన ఏడాది కాలంలో కాకినాడ నగరంలో 3,600లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సుమారు 20 సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టి బహిరంగ మలవిసర్జనలేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చేసిన కృషికి గాను ఈ గుర్తింపు లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement