
దేశంలోని సంపన్న కార్పొరేషన్..
దేశంలోని సంపన్న వంతమైన బీఎంసీ ఎలాంటి పన్నుల భారం మోపకుండా రూ. 2.60 కోట్ల మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ముఖ్యంగా బీజేపీ ఎన్నికల్లో ట్రాన్స్‌ఫరెన్సీ (పారదర్శకత) అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన శివసేన గతేడాది రూ. 37,052 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఈసారి రూ.11,910.64 కోట్లను తగ్గించి రూ. 25,141.51 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పార్కింగ్ సదుపాయాలను మూడింతలు పెంచనున్నారు. ముఖ్యంగా 92 పార్కింగ్ స్థలాల నుంచి 275 పార్కింగ్ స్థలాలకు పెంచనున్నారు. మూడు ప్రాంతాల్లో భూగర్భంలో (అండర్‌గ్రౌండ్) పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.కోటి కేటాయించారు. మరోవైపు బీఎంసీ అదనపు కమిషనర్ ఐ.ఎ. కుందన్, సమితి అధ్యక్షుడు శుభదా గుండేకర్ విద్యాశాఖ కోసం రూ. 2311.66 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ముఖ్యంగా బైకలాలోని రాణీబాగ్ అభివృద్ధి కోసం రూ.50.25 కోట్లను కేటాయించారు. ఇదిలా ఉండగా, ముంబై వాసులకు 500 చదరపు అడుగుల లోపు ఉండే ఇళ్లకు ఇంటి పన్నుల నుంచి మినహాయించనున్నట్టు శివసేన తమ మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్‌లో మాత్రం ఈ అంశం ఎక్కడ కన్పించలేదు. దీంతో శివసేన ఈ అంశాన్ని మరించిపోయిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.