మున్సిపల్ ఎన్నికలకు పార్టీ పరిశీలకులు | Municipal election observers : ysrcp | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఎన్నికలకు పార్టీ పరిశీలకులు

Published Wed, Sep 7 2016 2:37 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మున్సిపల్ ఎన్నికలకు పార్టీ పరిశీలకులు - Sakshi

మున్సిపల్ ఎన్నికలకు పార్టీ పరిశీలకులు

కార్పొరేషన్, మున్సిపాలిటీల నేతలతో భేటీలో వైఎస్ జగన్ నిర్ణయం

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పాలకవర్గాలు ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల పరిశీలకులను నియమించారు. మంగళవారం ఆయా కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని నేతలతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల వివరాలను తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు విడుదల చేశారు. ఈ పరిశీలకులు జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, లేదా సమన్వయకర్తలు, ఇన్‌చార్జులతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని కన్నబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement