‘స్మార్ట్’ సూచనలకు ఆహ్వానం
‘స్మార్ట్’ సూచనలకు ఆహ్వానం
Published Thu, Feb 16 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
– కర్నూలు అభివృద్ధికి ప్రతి ఏటా రూ.33 కోట్లు విడుదల
– ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ కో–ఆర్డినేటర్ స్మిత
కర్నూలు(టౌన్): కర్నూలు స్మార్ట్ సిటీగా ఎంపికైనందున..నగర అభివృద్ధికి పౌరులు, బిల్డర్లు తగిన సూచనలు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ కోఆర్డినేటర్ స్మిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ సమావేశ భవనంలో బిల్డర్లు, వివిధ సంస్థల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలన్నారు. ప్రతి ఏడాది కర్నూలు నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా రూ.33 కోట్లు నిధులు విడుదలవుతాయన్నారు.
ఈ నిధులను వెచ్చించి ప్రాధాన్య క్రమంలో మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, తాగునీరు, పార్కులు వంటి సౌకర్యాలు కల్పించేందుకు వీలు ఉంటుందన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ శివరామిరెడ్డి, బిల్డర్లు ఎంఎస్–9 మధుసూదన్‌రెడ్డి, సోమిశెట్టి వెంకటరామయ్య, గోరంట్ల రమణయ్య, కృష్ణకాంత్ బిల్డర్స్ వెంకటసుబ్బయ్య, సూపరింటెండెంట్లు ఇశ్రాయేల్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement