మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరాలి
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరాలి
Published Sat, Nov 5 2016 9:40 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
- టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది
- అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టినా బెదరొద్దు
- సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం
- పార్టీ జిల్లా అదనపు పరిశీలకులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేయాలని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వంతో పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అదనపు పరిశీలకులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంపై 92.8 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అది కర్నూలులో 93.4 శాతంగా ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా పక్కన పెట్టి పనిచేస్తే వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో విజయం తథ్యమన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అహర్నిశలు కష్టపడాలని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఇబ్బంది పెట్టినా బెదరకూడదని ధైర్యం నూరిపోశారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు స్థానికంగా ఉండే నాయకులతోపాటు తాను అండగా ఉంటానని చెప్పారు. అవసరమైతే పార్టీయే వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మరో ఆరు నెలలు గడిస్తే టీడీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుందని.. అప్పటిలోగా జరిగే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయాలను చూసి అధికారులు వద్దన్నా సహకరిస్తారన్నారు. అంతవరకు కొంత ఇబ్బందులు ఉన్నా ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. అంతకు ముందు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఒక్క సీటు రాదు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మునిసిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అక్టోబర్/నవంబర్ నెలల్లో ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే ఉద్దేశంతో ఫిబ్రవరి/మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఒక్క సీటు రాదని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి మంత్రం జపిస్తోందని, అయితే ప్రజలు వారి మోసాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌లోని 51 డివిజన్లను కైవసం చేసుకోచ్చని ధీమా వ్యక్తం చేశారు.
15లోపు డివిజన్ ఎలక‌్షన్ కమిటీలు..
కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ కమిటీలో నగరంలో ఉండే నాయకులు, కార్యకర్తలకు చోటు కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు డివిజన్ ఎలక‌్షన్ కమిటీల ఏర్పాటు బాధ్యతను పలువురు నాయకులకు అప్పగించినట్లు ఆయన వివరించారు. ఈ కమిటీలు నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆయా డివిజన్లలో ఓటర్ల నమోదు, పార్టీ ప్రచార కార్యక్రమాల బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు. జనవరి 10వ తేదీ తుది ఓటరు జాబితా విడుదల అవుతుందని, ఆ తరువాత రిజర్వేష్లను ఖరారు చేస్తారని, ఆ వెంటనే ఎన్నికలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కేంద్రపాలిక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవైరామయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకరరెడ్డి, నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు జహీర్ అహ్మద్, కృష్ణారెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ నాయకుడు సమన్వయ నాయకులు
1–8 హఫీజ్‌ఖాన్ అయుబ్‌ఖాన్, సురేంద్రనాథ్‌రెడ్డి
9–16 గౌరు వెంకటరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మద్దయ్య
17–25 బీవై రామయ్య విజయలక్ష్మీ, రమణ
26–36 గౌరు చరితారెడ్డి
37–42 కొత్తకోట ప్రకాష్‌రెడ్డి రహమాన్, ఫిరోజ్‌ఖాన్
43–51 నరసింహులు యాదవ్ ఈశ్వర్, సురేష్
నిరుత్సాహపడకండి: ఎంపీ బుట్టా రేణుక
వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజల్లో బలమైన ఆదరణ ఉందని, కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నా నిరుత్సాహపడకుండా పనిచేయాలని ఎంపీ బుట్టా రేణుక.. కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలో లేకపోవడంతో కొన్ని పనులు కావడంలేదన్నారు. కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానునగా ఇవ్వాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని నెలకొల్పుతుతామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు.
వక్ఫ్‌బోర్డు నిధులు మళ్లీంపు దారుణం: ఽహఫీజ్‌ఖాన్
వక్ఫ్‌బోర్డు నిధులను మసీదులకు మళ్లించడం దారుణమైన విషయమని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయక ర్త హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. ఈ విషయాన్ని మరచి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి మసీదులకు నిధులు తెప్పించినట్లు ముస్లింలను మోసం చేస్తున్నారన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు నిధులను పిల్లల స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయంబర్స్ కోసం వినియోగించేవారని తెలిపారు.
Advertisement
Advertisement