సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో ఉన్న 47 గురుకులాల్లోని 14 గురుకులాలను మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీఎం ఆర్‌ఈఐఎస్) పరిధిలోకి మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 12 గురుకుల పాఠశాలలతో పాటు ఉర్దూ మీడియం జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన 2 గురుకుల జూనియర్ కాలేజీలను టీఎంఆర్‌ఈఐఎస్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు.
టీఎంఆర్‌ఈఐఎస్ పరిధిలోకి వెళ్లిన విద్యాసంస్థల వివరాలు..కులీ కుతుబ్‌షా ఉర్దూ బాయ్స్ గురుకుల పాఠశాల బార్కాస్ (హైదరాబాద్), టీఎస్‌ఆర్ ఉర్దూ బాయ్స్ స్కూల్ నాగారం (నిజామాబాద్), టీఎస్‌ఆర్ ఉర్దూ బాయ్స్ స్కూల్ (సంగారెడ్డి), టీఎస్‌ఆర్ ఇంగ్లిషు మీడియం బాయ్స్ స్కూల్ ఎస్‌ఎల్‌బీసీ కాలనీ (నల్గొం డ), టీఎస్‌ఆర్ ఉర్దూ బాలికల స్కూల్ ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి), టీఎస్ ఆర్ ఉర్దూ గర్ల్æ్స స్కూల్ (మహబూబ్‌నగర్), టీఎస్‌ఆర్ మైనారిటీ గర్ల్స్ స్కూల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, కామారెడ్డి, జహీరాబాద్, వనపర్తి, వరంగల్‌లోని టీఎస్‌ఆర్ మైనారిటీ బాయ్స్ స్కూళ్లను మైనారిటీ గురుకుల సొసైటీ పరిధిలోకి తెచ్చారు. ఎల్‌బీనగర్‌లోని బార్కాస్ కులీకు తుబ్‌షా ఉర్దూ గురుకుల జూనియర్ కాలేజీ, నిజామాబాద్ జిల్లా నాగారం లోని టీఎస్‌ఆర్ ఉర్దూ బాయ్స్ జూనియర్ కాలేజీలను బదలాయించారు.
‘మైనారిటీ’ పరిధిలోకి 14 గురుకులాలు
Published Fri, Mar 31 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
Advertisement