పీఎస్‌ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ | free coaching for ps candidates | Sakshi
Sakshi News home page

పీఎస్‌ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ

Published Wed, Mar 8 2017 12:45 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

free coaching for ps candidates

కర్నూలు (రాజ్‌విహార్‌): పంచాయతీ సెక్రటరీ(పీఎస్‌)పోస్టులకు సంబంధించిన పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ ఎడ్యూకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ సంస్థ డిప్యూటి డైరెక్టరు సయ్యద్‌ ఇందాద్‌ అలీ ఖాద్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలు అర్హులన్నారు. నెల రోజుల శిక్షణతోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ ఇస్తామన్నారు. బుధవారం నుంచి తమ కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తామన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఏప్రిల్‌ 20 వరకు  శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు ఉస్మానియా కళాశాలలోగానీ, ఫోన్‌ (94945 55961, 94417 61178) ద్వారా కానీ సంప్రదించాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement