
వైఎస్సార్‌సీపీలోకి మైనారిటీలను ఆహ్వానిస్తున్న వంశీకృష్ణ
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ముస్లిం మైనారిటీల అభ్యున్నతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే వారికి మేలు జరుగుతుందని పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ కలయిక కార్యక్రమం శుక్రవారం 9వ వార్డులో గల హెచ్‌బీకాలనీలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి ఎస్‌కే ఆజమ్ ఆలీ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వంశీకృష్ణ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 4 శాతం రిజర్వేషన్లుకు కల్పించి ముస్లింల ప్రగతికి బాటలు వేశారన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజాసంకల్పయాత్రలో జనంతో మమేకమవుతూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్న జననేత జగనన్న రానున్న ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ముస్లిం సోదరులంతా వైఎస్సార్ïసీపీ పక్షాన ఉంటున్నారన్నారు. రాష్ట్ర మంత్రిమండలిలో మైనారిటీల మంత్రి పదవి ఇవ్వకుండా ముస్లింలను చంద్రబాబు దగా చేశారన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి రాజకీయం మాత్రమే చేస్తున్నారని దుయ్యబట్టారు.
100 మంది కుటుంబాల ముస్లిం సోదరులు పార్టీలో చేరిక
ఆత్మీయ సమ్మేళనంలో తూర్పు నియోజకవర్గానికి చెందిన 100 ముస్లిం కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికి వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ కడువువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ముస్లిం సోదరులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసేందుకు మైనారిటీ ముస్లింలంతా సిద్ధంగా వున్నామన్నారు. గుంటూరులో ముస్లిం యువతపై చేసిన దాడులు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ కోస్తాంధ్ర అ«ధ్యక్షుడు ఐ.హెచ్.ఫరూకీ, మాజీ కార్పొరేటర్ నడింపల్లి కృష్ణంరాజు, మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సబీరా బేగం, 2వ వార్డు అధ్యక్షుడు గొలగాని శ్రీనివాస్, హాసీన్, మదరీసా, సాహుద్, ఫీరోజ్ హుసేన్, షేక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment