వక్ఫ్ బోర్డ్‌కు సీఈవోను నియమించండి
Published Tue, Sep 3 2013 3:53 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌కు పూర్తిస్థాయి ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో)ని నియమించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వక్ఫ్ బోర్డులో అకౌంటింగ్ అధికారిగా ఉన్న ఎం.ఎ.గఫార్‌ను సీఈవోగా కొనసాగేందుకు అనుమతి ఇస్తూ ఈ ఏడాది జూన్ 22న మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన సయ్యద్ ఒమర్ షఫీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీన్ని సోమవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రెండు వారాల్లో వక్ఫ్ బోర్డ్‌కు పూర్తిస్థాయి సీఈవోను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
Advertisement