న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం మైనారిటీ విద్యార్థులు టీఆర్‌ఎస్ మైనారిటీ విభాగం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ షకీల్ అహ్మద్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. 1నుంచి 10 వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, ఆపై తరగతుల వారు కూడా ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఫ్రెష్ అభ్యర్థులతో పాటు, రెనివల్ చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను అందించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఫీజు వివరాల రషీదును ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్లు చెప్పా రు. ఇతర వివరాలకోసం 94905 82690, 97032 88868 సెల్‌నెంబర్‌లను సంప్రదిం చాలని సూచించారు.