సాక్షి, హైదరాబాద్: మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయమై ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందని కేటీఆర్ విమర్శించారు.
‘మైనారిటీలు, బీసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.మైనారిటీలకు కులగణనతో సంబంధం లేదు. ఇది బీజేపీ కుట్రలాగా కనిపిస్తోంది. మైనారిటీలను బీసీల్లో కలిపితే వారు తమ హక్కులన్నీ కోల్పోతారు. కాంగ్రెస్ వెంటనే మైనారిటీ డిక్లరేషన్‌ను ఉపసంహరించుకోవాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు!
Comments
Please login to add a commentAdd a comment