బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ కలిసే పనిచేస్తాయి: రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Key Comments Over BJP And BRS In Campaign | Sakshi
Sakshi News home page

బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ కలిసే పనిచేస్తాయి: రాహుల్‌ గాంధీ

Published Tue, Nov 28 2023 12:45 PM | Last Updated on Tue, Nov 28 2023 4:56 PM

Rahul Gandhi Key Comments Over BJP And BRS In Campaign - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్‌ నేతలు స్పీడ్‌ పెంచారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. నాంపల్లిలో కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. 

నాంపల్లి సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘ప్రేమను పంచాలనే లక్ష్యంతో భారత్‌ జోడో యాత్ర చేశాను. బీజేపీ విభజన రాజకీయాలు చేసింది. మన దేశ సంస్కృతి ఇది కాదు. నాపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారు. నాపై పరువు నష్టం కేసు కూడా వేశారు. నా లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. నాపై 24 కేసులు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఒవైసీపై ఎన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఉంటాయి. ఒవైసీపై ఎందుకు ఉండవు. కాంగ్రెస్‌, బీజేపీ పోటీచేసే రాష్ట్రాల్లో.. మా ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం వస్తుంది. బీజేపీ ఇచ్చిన లిస్ట్‌తో తమ అభ్యర్థులను ఎంఐఎం ప్రకటిస్తుంది. 

బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. నేను మోదీతో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తే లేదు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే.. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలి. హైదరాబాద్‌లో మెట్రో, ఎయిర్‌పోర్టు నిర్మించింది కాంగ్రెస్‌ హయాంలోనే. బైబై కేసీఆర్‌ అని చెప్పే సమయం వచ్చింది’ అని కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement